MovieGQ

Mouname Nee Basha

Guppedu Manasu (1979) · Track 3 of 4

Song Details

Lyrics

మౌనమే నీ భాష ఓ మూగ మనసా మౌనమే నీ బాష ఓ మూగ మనసా తలపులు ఎన్నెన్నో కలలుగ కంటావు కల్లలు కాగానే కన్నీరౌతావు మౌనమే నీ భాష ఓ మూగ మనసా ఓ మూగ మనసా చీకటి గుహ నీవు చింతల చెలి నీవు నాటక రంగానివే మనసా తెగిన పతంగానివే ఎందుకు వలచేవో ఎందుకు వగచేవో ఎందుకు రగిలేవో ఏమై మిగిలేవో ఎందుకు రగిలేవో ఏమై మిగిలేవో కోర్కెల సెగ నీవు ఊరిమి వల నీవు ఊహల ఉయ్యల్లవే మనసా మాయల దెయ్యానివ్వే లేనిది కోరేవు ఉన్నది వదిలేవు ఒక పొరపాటుకు యుగములు పగిలేవు ఒక పొరపాటుకు యుగములు పగిలేవు " మౌనమే నీ భాష ఓ మూగ మనసా మౌనమే నీ భాష ఓ మూగ మనసా తలపులు ఎన్నెన్నో కలలుగా కంటావు కల్లలు కాగానే కన్నీరౌతావు మౌనమే నీ భాష ఓ మూగ మనసా ఓ మూగ మనసా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Guppedu Manasu

See All