Kadhile Rangula Villu Ra
Song
Movie
-
Music Director
-
Lyricist
-
Singer
-
Lyrics
- ఉఁ... కదిలే రంగుల విల్లురా
ఎదురై గుండెను గిల్లెరా
అరెరే వెన్నెల కూతురా
అనిపించిదా అప్సరా
తాజమహాల్ మీదోట్టు
తన మేని రంగు మెరుపు
కోహినూరు మీదోట్టు
తన మనసు అచ్చ తెలుపు
రేయిలాంటి మైమరపు
నీలాల కురుల నలుపు
పరుగు తీసే ప్రతి తలపు
ఆ రాకుమారి వైపు
అలాంటిలాంటమ్మాయ్ కాదురా
అలై వచ్చి నన్నే తాకెరా
అలా ఎలా పుట్టేసిందిరా
అమాంతంగ నచ్చేసిందిరా
బొమ్మగా తననే చేసి
బ్రహ్మ తన పనిమానేసి
బుగ్గలే గిల్లాడేమో...
అందమే తననే చూసి
ముద్దుగా దిస్టే తీసి
హారతే పడుతుందేమో
ఆ సొగసులపై ఒక కవితే రాయాలమ్మా
ఏ భాషలో పదములు అయినా సరిపోయేనా
అలాంటిలాంటమ్మాయ్ కాదురా
అలై వచ్చి నన్నే తాకెరా
ఏ అలా ఎలా పుట్టేసిందిరా
అమాంతంగ నచ్చేసిందిరా
పంజరం లేనేలేని
పావురం నేనైపోయా
జంటగా తనతో కదిలీ...
లోకమే ఏమైపోనీ
పట్టని పరుగై పోయా
నన్నలా విడిగా వదిలి
తొలి జన్మల పూజల కైనా
దొరకని భాగ్యం
కోవెలలో దేవత రూపం
ఆ సౌందర్యం
అలాంటిలాంటమ్మాయ్ కాదురా
అలై వచ్చి నన్నే తాకెరా
హే అలా ఎలా పుట్టేసిందిరా
అమాంతంగ నచ్చేసిందిరా
- ఉఁ... కదిలే రంగుల విల్లురా
Gunturodu
Movie More SongsKadhile Rangula Villu Ra Keyword Tags
-
-
-