Song Details
Lyrics
కల కనులకు ఇక నేరం నిదురకు ఇక దూరం నడవదు క్షణకాలం కలవరం మొదలై వరముగ నీ స్నేహం అడిగెను మది పాపం తన మనుగడ కోసం బదులిడు చెలివై ఓ తారకా... ఆఅ.. నా కోరికా.. కాదనకే కళ్ళాలతో అల్లాడదా నా వలపే.. చేజారిపోతే నే రాలిపోతా నువు కాదన్న రోజే శ్వాసాగిపోదా నీ పాదాలు మోసే భారాన్ని నాకిచ్చేయ్ వే వయ్యారీ చేజారిపోతే నే రాలిపోతా నువు కాదన్న రోజే శ్వాసాగిపోదా నీ పాదాలు మోసే భారాన్ని నాకిచ్చేయ్ వే వయ్యారీ నడిచేటీ దారులలొ పడిగాపై చేరెదవా నడిరేయి భయమేస్తే నానీడై ఉంటావా వెన్నెలింటిలో మిన్నునడిగి అతిథులుగా అడుగేద్దాం చందమామనే కథలడిగి నిదరోయి నవ్వేద్దాం నీతో నేను నాతో నువ్వు కాలం తీరిపోయినా ప్రేమే ఆవిరవునా నువ్వు నా దేహం నేన్నీ ప్రాణం ప్రేమే పల్లవించదా మనమై పులకరించదా చేజారిపోతే నే రాలిపోతా నువు కాదన్న రోజే శ్వాసాగిపోదా నా పాదాలు మోసే భారాన్ని నీకిచ్చేయ్ నా వచ్చేయ్ వా చేజారిపోతే నే రాలిపోతా నువు కాదన్న రోజే శ్వాసాగిపోదా నా పాదాలు మోసే భారాన్ని నీకిచ్చేయ్ నా వచ్చేయ్ వా చేజారిపోతే నే రాలిపోతా నువు కాదన్న రోజే శ్వాసాగిపోదా నీ పాదాలు మోసే భారాన్ని నాకిచ్చేయ్ వే వచ్చేయ్ వా చేజారిపోతే నే రాలిపోతా నువు కాదన్న రోజే శ్వాసాగిపోదా నా పాదాలు మోసే భారాన్ని నీకిచ్చేయ్ నా వచ్చేయ్ వా
Lyrics sourced from public databases. May contain errors.