Song Details
Lyrics
ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావో అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషమూ నేను నా గుండె ఏనాడో చేజారిపోయింది నీ నీడగా మారి నా వైపు రానంది దూరాన ఉంటూనే ఏ మాయ చేశావో ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావో అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషమూ నేను నడిరేయిలో నీవు.. నిదురైన రానీవు.. గడిపేదెలా కాలమూ .. గడిపేదెలా కాలమూ .. పగలైన కాసేపు ... పని చేసుకోనీవు... నీ మీదనే ధ్యానము .. నీ మీదనే ధ్యానము .. ఏ వైపు చూస్తున్నా ... నీ రూపే తోచింది... నువు కాక వేరేదీ .. కనిపించనంటోంది... ఈ ఇంద్రజాలాన్ని .. నీవేనా చేసింది... నీ పేరులో ఏదో ... ప్రియమైన కైపుంది.. నీ మాట వింటూనే .. ఏం తోచనీకుంది.. నీ మీద ఆశేదో ... నను నిలవనీకుంది.. మతి పోయి నేనుంటే... నువు నవ్వుకుంటావు.. ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావో అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషమూ నేను
Lyrics sourced from public databases. May contain errors.