Song Details
Lyrics
పల్లవి: అభినవ శశిరేఖవో ప్రియతమ శుభలేఖవో అభినవ శశిరేఖవో ప్రియతమ శుభలేఖవో ఆ తొలి చూపు కిరణాల నెలవంక నీవో నవయువ కవిరాజువో ప్రియతమ నెలరాజువో నా కనుదోయి కమలాల భ్రమరమ్ము నీవో నవయువ కవిరాజువో ప్రియతమ నెలరాజువో చరణం: 1 ఆ కనులు ఇంద్ర నీలాలుగా ఈ తనువు చంద్రశిఖరాలుగా కదలాడు కల్యాణివే నా హృదయం మధుర సంగీతమై కల్యాణ వీణ స్వరగీతమై శ్రుతి చేయు జతగాడివే ఆ జతలోన వెతలన్ని చల్లార్చవే నవయువ కవిరాజువో.. అభినవ శశిరేఖవో చరణం: 2 నా వయసు వలపు హరివిల్లుగా నవపారిజాతాల పొదరిల్లుగా రావోయి రవిశేఖరా తొలి సంధ్య మధుర మందారమే నీ నుదిటి తిలక సింగారమై నూరేళ్ళు వెలిగించనా నా నూరేళ్ళ నెలవళ్ళు కరిగించనా... నవయువ కవిరాజువో ప్రియతమ నెలరాజువో నా కనుదోయి కమలాల భ్రమరమ్ము నీవో నవయువ కవిరాజువో ప్రియతమ నెలరాజువో అభినవ శశిరేఖవో ప్రియతమ శుభలేఖవో అభినవ శశిరేఖవో ప్రియతమ శుభలేఖవో
Lyrics sourced from public databases. May contain errors.