Song Details
Lyrics
పల్లవి: చీకటి కాటుక చారల చెంపల వాకిట వ్రాసిన కన్నీటి అమవాసలో... చిగురాశల వేకువరేఖల కెంపుల ముగ్గులు వేసిన నీ చూపు కిరణాలలో... వెలిగింది నా ప్రాణదీపం ...ఈ జన్మంత నీ పూజకోసం నీ నీడ దేవాలయం ...మది నీకు నీరాజనం ప్రతి అణువు... పూలహరం..ఉం... వెలిగింది నా ప్రాణదీపం... ఈ జన్మంత నీ పూజకోసం చరణం: 1 నలుపైన మేఘాలలోనే ...ఇల నిలిపేటి జలధారలేదా నలుపైన మేఘాలలోనే... ఇల నిలిపేటి జలధారలేదా వసివాడు అందాలకన్నా ...నీ సుగుణాల సిరి నాకు మిన్నా వసివాడు అందాలకన్నా ...నీ సుగుణాల సిరి నాకు మిన్నా తీయని ఊహలతీరము ...చేరువ చేసిన స్నేహము... ఏనాటి సౌభాగ్యమో వెలిగింది నా ప్రాణదీపం... ఈ జన్మంత నీ పూజకోసం నీ నీడ దేవాలయం ...మది నీకు నీరాజనం ప్రతి అణువు... పూలహరం వెలిగింది నా ప్రాణదీపం... ఈ జన్మంత నీ పూజకోసం చరణం: 2 నూరేళ్ళ బ్రతుకీయమంటు ...ఆ దైవాన్ని నే కోరుకుంటా నూరేళ్ళ బ్రతుకీయమంటు ...ఆ దైవాన్ని నే కోరుకుంటా ప్రతిరోజు విరిమాలచేసి ...నీ పాదాల అర్పించుకుంటా ప్రతిరోజు విరిమాలచేసి ...నీ పాదాల అర్పించుకుంటా మాయని మమతల తావున... నిండిన జీవనవాహిని... ప్రతిరోజు మధుమాసమే.. వెలిగింది నా ప్రాణదీపం ...ఈ జన్మంత నీ పూజకోసం నీ నీడ దేవాలయం... మది నీకు నీరాజనం ప్రతి అణువు ...పూలహరం వెలిగింది నా ప్రాణదీపం... ఈ జన్మంత నీ పూజకోసం
Lyrics sourced from public databases. May contain errors.