Gorinta Poochindhi
Song
Movie
-
Music Director
-
Lyricist
-
Singer
-
Lyrics
- గోరింట పూచింది కొమ్మా లేకుండా
మురిపాలా అరచేత మొగ్గా తొడిగింది
గోరింట పూచింది కొమ్మా లేకుండా
మురిపాలా అరచేత మొగ్గా తొడిగింది
ఎంచక్కా పండిన ఎర్రని చుక్క
ఎంచక్కా పండిన ఎర్రని చుక్క
చిట్టీ పేరింటానికి శ్రీరామరక్ష
కన్నే పేరంటాలకి కలకాలం రక్ష
గోరింట పూచింది కొమ్మా లేకుండా
మురిపాలా అరచేత మొగ్గా తొడిగింది
చరణం: 1
మామిడీ చిగురెరుపూ మంకెన పువ్వెరుపు
మణులన్నింటిలోనా మాణిక్యం ఎరుపు
మామిడీ చిగురెరుపూ మంకెన పువ్వెరుపు
మణులన్నింటిలోనా మాణిక్యం ఎరుపు
సందె వెలుగుల్లోనా దాగె మబ్బెరుపు
సందె వెలుగుల్లోనా దాగె మబ్బెరుపు
తానెరుపు అమ్మాయి తనవారిలోనా
గోరింట పూచింది కొమ్మా లేకుండా
మురిపాలా అరచేత మొగ్గా తొడిగింది
చరణం: 2
మందారంలా పూస్తే మంచి మొగుడొస్తాడు
గన్నేరులా పూస్తే కలవాడొస్తాడు
మందారంలా పూస్తే మంచి మొగుడొస్తాడు
గన్నేరులా పూస్తే కలవాడొస్తాడు
సింధూరంలా పూస్తే చిట్టీ చేయంతా
సింధూరంలా పూస్తే చిట్టీ చేయంతా
అందాల చందమామ అతనే దిగివస్తాడు
గోరింట పూచింది కొమ్మా లేకుండా
మురిపాలా అరచేత మొగ్గా తొడిగింది
పడకూడదమ్మా పాపాయి మీదా
పాపిష్టీ కళ్ళు కోపిష్టీ కళ్ళు
పాపిష్టీ కళ్ళల్లో పచ్చా కామెర్లు
కోపిష్టి కళ్ళలో కొరివి మంటల్లు
గోరింట పూచింది కొమ్మా లేకుండా
మురిపాలా అరచేత మొగ్గా తొడిగింది
- గోరింట పూచింది కొమ్మా లేకుండా
Gorintaku
Movie More SongsGorinta Poochindhi Keyword Tags
-
-
-