Song Details
Lyrics
నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విలవిల నువ్వెక్కడుంటే నేనెక్కడుంటే మౌనం గలగల ఎందుకో ఏకాంతవేళా చెంతకే రానందీ వేళ గాలిలో రాగాలమాలా జంటగా తోడుంది నీలా నీ ఊహలో కల ఊగింది ఊయల ఆకాశవాణిలా పాడింది కోకిల నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విలవిల నువ్వెక్కడుంటే నేనెక్కడుంటే మౌనం గలగల సరిగమలే వర్ణాలుగ కలగలిసేనా కంటి పరదా నీ బొమ్మగ కళలొలికేనా వర్ణమై వచ్చానా వర్ణమే పాడానా జాణ తెలుగులా జాణ వెలుగులా వెన్నెలై గిచ్చానా వేకువే తెచ్చానా పాల మడుగులా పూల జిలుగులా అన్ని పోలికలు విన్నా వేడుకలో ఉన్నా నువ్వేమన్నా నీ మాటలో నన్నే చూస్తున్నా నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విలవిల నువ్వక్కడుంటే నేనక్కడుంటే మౌనం గలగల ప్రతి ఉదయం నీలా నవ్వే సొగసుల జోలా ప్రతి కిరణం నీలా వాలే వెలుగుల మాలా అంతగా నచ్చానా ఆశలే పెంచానా గొంతు కలపనా గుండె తడపనా నిన్నలా వచ్చానా రేపుగా మారానా ప్రేమ తరపునా గీత చెరపనా ఎంత దూరాన నే ఉన్నా నీతోనే నేలేనా నా ఊపిరే నీ ఊసుగా మారిందంటున్నా నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విలవిల నువ్వెక్కడుంటే నేనెక్కడుంటే మౌనం గలగల ఎందుకో ఏకాంతవేళా చెంతకే రానందీ వేళ గాలిలో రాగాలమాలా జంటగా తోడుంది నీలా నీ ఊహలో కల ఊగింది ఊయల ఆకాశవాణిలా పాడింది కోకిల నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విలవిల నువ్వెక్కడుంటే నేనక్కడుంటే మౌనం గలగల
Lyrics sourced from public databases. May contain errors.