Song Details
Lyrics
నీ కళ్ళలోన నన్నే చూస్తున్నా నీ పెదవుల మెరుపుల్లో నేనే ఉన్నా నీ ఊపిరిలోన నను దాచేస్తున్నా నీ కౌగిలిలో నను వదిలేస్తున్నా నా కోసం నేనసలే లేనంటున్నా నీ తోడై నేనుంటే చాలంటున్నా నా హృదయం నీది నా సమయం నీది నేనంటే నువ్వంటు జీవిస్తున్నా ఒక నువ్వు ఒక నేను ఒకటయ్యాం మనం ఇక పైన ఇద్దరికి ఒక ప్రాణం (3) ఉన్నానంటే ఉన్నాను ఇన్నేళ్ల వరకు నేనెవరంటు తెలిసింది ఇన్నాళ్లకు రంగై కలలే చూపావు నాలోని కలకు ఉబికే కన్నీరయ్యాను నీ ప్రేమకు చెలియా వీలైతే గతమంతా చెరిపి మరల మొదలవన నీ జత కలిసి వినిపించవే జోలలై ఆలాపన నీ పసిపాపనయ్యను నీ నీడన నేనంటూ లేనంటూ చేరిపేస్తున్నా నీ పేరుకు నా పేరు కలిపేస్తున్నా నా హృదయం నీది నా సమయం నీది నేనంటే నువ్వంటు జీవిస్తున్నా ఒక నువ్వు ఒక నేను ఒకటయ్యాం మనం ఇక పైన ఇద్దరికి ఒక ప్రాణం (3) లేనే లేదన్నా మతిక లేనే లేదే అన్నీ దొరికాయి నీ చిరునవ్వులో వేరే వరమేది కోరగా తోచలేదే దేవత నా జతగా ఉందను ధ్యాసలో బ్రతుకే బంగారు వర్ణాన మెరిసే వెతకని పుదరి నేల కలిసే ఏడు రంగుల్లో చల్లవే నీ కాంతిని ఏదేమైనా విడిపోకు నా చేతిని చినుకంటి నీ ప్రేమకు పులకిస్తున్నా మన ప్రేమకు చిగురిస్తున్నా నా హృదయం నీది నా సమయం నీది నేనంటే నువ్వంటు జీవిస్తున్నా ఒక నువ్వు ఒక నేను ఒకటయ్యాం మనం ఇక పైన ఇద్దరికి ఒక ప్రాణం (3)
Lyrics sourced from public databases. May contain errors.