Song Details
Lyrics
అలుపన్నది ఉందా ఎగిరే అలకు యదలోని లయకు అదుపన్నది ఉందా కలిగే కలకు కరిగే వరకు మెలికలు తిరిగే నది నడకలకు మరి మరి ఉరికే మది తలపులకు లల లల లలలలా... అలుపన్నది ఉందా ఎగిరే అలకు యదలోని లయకు అదుపన్నది ఉందా కలిగే కలకు కరిగే వరకు చరణం: 1 నా కోసమే చినుకై కరిగి ఆకాశమే దిగదా ఇలకు నా సేవకే సిరులే చిలికి దాసోహమే అనదా వెలుగు ఆరారు కాలాల అందాలు బహుమతి కావా నా ఊహలకు కలలను తేవా నా కన్నులకు లల లల లలలలా... అలుపన్నది ఉందా ఎగిరే అలకు యదలోని లయకు అదుపన్నది ఉందా కలిగే కలకు కరిగే వరకు చరణం: 2 నీ చూపులే తడిపే వరకు ఏమైనదో నాలో వయసు నీ ఊపిరే తగిలే వరకు ఎటు ఉన్నదో మెరిసే సొగసు ఏడేడు లోకాల ద్వారాల తలుపులు తెరిచే తరుణం కొరకు ఎదురుగ నడిచే తొలి ఆశలకు లల లల లలలలా... అలుపన్నది ఉందా ఎగిరే అలకు యదలోని లయకు అదుపన్నది ఉందా కలిగే కలకు కరిగే వరకు మెలికలు తిరిగే నది నడకలకు మరి మరి ఉరికే మది తలపులకు లల లల లలలలా... అలుపన్నది ఉందా ఎగిరే అలకు యదలోని లయకు
Lyrics sourced from public databases. May contain errors.