Song Details
Lyrics
పల్లవి: నీ ఇల్లు బంగారంగాను .. నా ఒళ్ళు సింగారంగాను జోరుమీద ఉన్నావు జోడు కడతావా .. మోజుమీద సన్నజాజి పూలు పెడతావా నీ ఇల్లు బంగారంగాను .. నా ఒళ్ళు సింగారంగాను పొంగుమీద ఉన్నావు తోడు పెడతావా .. మురిపాల మీగడంతా తోడిపెడతావా GOLDMAN.. అహా ... GOLDMAN చరణం: 1 బంగారు కొండమీద శృంగార కోటలోన ..చిలకుంది తెమ్మంటావా.. చిలకుంది తెమ్మంటావా రతనాళ రాతిరేళా పగడాల పక్క చూపి .. పలికింది రమ్మంటావా ఏడేడు వారాల నగలిస్తే రమ్మంటా .. హారాలకే అగ్రహారాలు రాసిస్తా అందాల గని ఉంది నువ్వు చూసుకో .. నీకందాక పని ఉంటే నన్ను చూసుకో చరణం: 2 వజ్రాలవాడలోన వైఢూర్యమంటి నన్ను ..వాటేయ వద్దంటావా.. వాటేయ వద్దంటావా ముత్యాల మేడలోనా .. మాణిక్యమంటి నన్ను .. ముద్దాడ వస్తుంటావా వరహాల పందిట్లో విరహాలు నీకేల .. రతనాల ముంగిట్లో రాగాలు తీయాల మేలైన సరుకుంది మేలమాడుకో .. ఓ గీటురాయి మీద దాన్ని గీసి చూసుకో
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Gaja Donga
See AllAllaneredu Settukaada
S.P. Balasubrahmanyam, S. Janaki
Indradhanasu Cheera Katti
S.P. Balasubrahmanyam, P. Susheela
Idho Rakam Dhaham
S.P. Balasubrahmanyam, S. Janaki
Chuppanathi Chandhurudu
S.P. Balasubrahmanyam, P. Susheela
Oka Rathiri Oka Pokiri
S.P. Balasubrahmanyam, P. Susheela, S. Janaki
Rendaksharala Prema
S.P. Balasubrahmanyam