MovieGQ

Gamyaanne - The Quest

Gaami (2024) · Track 1 of 2

Lyrics

సొమ్మసిల్లిపోయి కూలింది కాలం, సత్తువంటూ లేక ఇంకెంత కాలం !!! సన్నగిల్లకుంది ఈ వింత దూరం, దిక్కుతోచకుండ ఇంకెంత దూరం !!! (x2) గమ్యాన్నే ఛేదించే స్థైర్యంతో పదా ధైర్యాన్నే సంధించెయ్, వచ్చిందో ఆపద ... కాలకూటమైన ఈ తీపి స్పర్శ, అమృతంగా మారే దారుందా ఈశ !!! తనువు నీలమౌతూ పెడుతుంటే ఘోష , జీవమున్నా చావు పొందిందా శ్వాస !!! బేతాళ ప్రశ్నేదో వాలిందంటే, బదులిచ్చి తీరాలి కాదా... లోనున్న భయమంటూ పోవాలంటే, దాగున్న సత్యాన్ని వెతకాలంటా... చేయూతనిచ్చే ఆశే ఉంటే, ఆగామి రాదా నీకై... గాయాన్ని దాటి చేరాలంతే, నిన్నే నువ్వు గామివై ... గమ్యాన్నే ఛేదించే స్థైర్యంతో పదా ధైర్యాన్నే సంధించెయ్ , వచ్చిందో ఆపద నేలలోకి నిన్ను నెడుతుంటే శోకం, చూసీ చూడనట్టే ఉంటుంది లోకం... జరుగుతోంది నిత్య ఏకాకి యుద్ధం, నువ్వు తప్ప నీకు ఏముంది సైన్యం!!! కన్నీళ్ళు నిలువెల్లా ముంచేస్తున్నా, ఎదురీది చేరాలి ఒడ్డు... దుఃఖాలు నీ చుట్టూ కంచేస్తున్నా, ఎదిరించే తెగువుంటే కాదోయ్ అడ్డు చేయూతనిచ్చే ఆశే ఉంటే, ఆగామి రాదా నీకై గాయాన్ని దాటి చేరాలంతే, నిన్నే నువ్వు గామివై ... గమ్యాన్నే ఛేదించే స్థైర్యంతో పదా ధైర్యాన్నే సంధించెయ్, వచ్చిందో ఆపద ... (x2)

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Gaami

See All