MovieGQ

Manasu Mechina

Ekalavya (1982) · Track 10 of 19

Song Details

Lyrics

పల్లవి: మనసు మెచ్చిన చిన్నది.. నన్ను మనువాడబోతున్నది..ఆఁ మనసు మెచ్చిన చిన్నది.. నన్ను మనువాడబోతున్నది ఆలన.. పాలన.. నా మీద తోసేసి అది పనిగా పలురుచులు అందీయనున్నది మదికి నచ్చిన చిన్నడు.. నన్ను మనువాడబోతున్నడు..ఆఁ.. మదికి నచ్చిన చిన్నడు.. నన్ను మనువాడబోతున్నడు ముచ్చట.. అచ్చట.. ముప్పూటలా మెక్కి తొక్కి నా ఎద మీద సోలిపోనున్నడు మనసు మెచ్చిన చిన్నది.. నను మనువాడబోతున్నది చరణం: 1 పాడు మనసు ఆగనంటుంది పెళ్ళిదాకా ఈడు కుదిరాక నిన్నే చూస్తూ నిలవలేకా..ఆ.. ఆ.. పాడు మనసు ఆగనంటుంది పెళ్ళిదాకా ఈడు కుదిరాక నిన్నే చూస్తూ నిలవలేకా అమ్మబాబు.. మూడు ముళ్ళెసినంత దాకా అట్టె బులిపించి మానం ప్రాణం తీయమాకా అయితే గంగనో మంగనో నే చూసుకుంటాను అది కనక నిజమైతే రెండిచ్చుకుంటాను రెండా? ఏంటి? మ్చ్.. మ్చ్.. హేయ్ .. మనసు మెచ్చిన చిన్నది.. నన్ను మనువాడబోతున్నది మదికి నచ్చిన చిన్నడు.. నన్ను మనువాడబోతున్నడు ఆహహా.. ఆహాహహాహహా.. హాహా.. ఆహహా.. ఆహాహహాహహా.. ఆహహా.. చరణం: 2 అయ్యో రామా రైక పిగిలింది బుద్ధిలేకా సిగ్గు జారింది అదుపూ ఆనా రెండు లేకా..ఆ..ఆ.. అయ్యో రామా రైక పిగిలింది బుద్ధిలేకా సిగ్గు జారింది అదుపూ ఆనా రెండు లేకా..ఆ..ఆ.. మంచిదేలే కదా అందాక వచ్చినాకా ముద్దుమురిపాలు తీరే దాకా మూయవాకా అవ్వా.. ఆశకు ఆటకు అద్దుండాలంటాను అద్దంటూ గిరి గీస్తే ఐదిచ్చుకుంటాను ఐదా? ఏంటి? మ్చ్ మ్చ్ మ్చ్ మ్చ్ మ్చ్.. హేయ్ .. మనసు మెచ్చిన చిన్నది.. నన్ను మనువాడబోతున్నది ఆలన.. పాలన.. నా మీద తోసేసి అదిపనిగా పలురుచులు అందీయనున్నది మదికి నచ్చిన చిన్నడు.. నన్ను మనువాడబోతున్నడు లలలాలాలలాలలల.. లలలాలాలలాలలల..

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Ekalavya

See All