Song Details
Lyrics
పల్లవి: శిలనొక్క ప్రతిమగా...మలచింది నీవే... ఆ ప్రతిమనీ.. దైవముగా...కొలిచింది నీవే... నేననుకున్నది కాదూ...ఇది నేననుకున్నది కాదూ... కలనైనా తలచింది కానే కాదు...ఏనాటిదో ఈ బంధం... ఈ వెన్నెల్లా.. జాబిల్లి అనుబంధం.... మదినొక్క గుడివోలే...మలచింది నీవే... ఆ గుడిలోనే కరుణతో...వెలసింది నీవే.... నేననుకున్నది కాదూ...ఇది నేననుకున్నది కాదూ... కలనైనా తలచింది కానే కాదు...ఏనాటిదో ఈ బంధం... ఈ వెన్నెల్లా... జాబిల్లి అనుబంధం.... నేననుకున్నది కాదూ...ఇది నేననుకున్నది కాదూ... చరణం: 1 నీ చెంతగ ఎన్నాళ్ళున్నా...నిన్ను చేరుకోలేదు... ఎదుట ఉన్న పారిజాతం ..ఎదను చేర్చుకోలేదు... అపరంజి కోవెల ఉన్నా..అలరారు దైవం ఉన్నా... ఆ గుడితలుపులు ఈనాడే తెరచుకున్నాయి...లోనికి పిలుచుకున్నాయి.... నేననుకున్నది కాదూ...ఇది నేననుకున్నది కాదూ... చరణం: 2 కడలి నిండ నీరున్నా..కదలలేని నావను నేను.. అడగాలని మదిలో ఉన్నా.. పెదవి కదపలేకున్నాను.. నావకు తెరచాపనై...నడిపే చిరుగాలినై... కలలో.. ఇలలో ..నీ కోసం పలవరించేనూ...నీలో కలిసిపోయేనూ... నేననుకున్నది కాదూ...ఇది నేననుకున్నది కాదూ... కలనైనా తలచింది కానే కాదు...ఏనాటిదో ఈ బంధం... ఈ వెన్నెల్లా జాబిల్లి అనుబంధం....ఉమ్మ్...ఉమ్మ్.. నేననుకున్నది కాదూ...ఇది నేననుకున్నది కాదూ...
Lyrics sourced from public databases. May contain errors.