MovieGQ

Chandamama

Dongalludu (1993) · Track 1 of 5

Song Details

Lyrics

చందమామ కన్నుగొట్టె సందెవేళ సిగ్గుమల్లె పూలుపెట్టె చీకటేల మంచెకాడుంది రావే పంచదార మాపటేల తోడుపెట్టేసుకుంటా పొంగులన్ని పాలవేల అందమంత ఆరబెట్టె పైటజారే కోడిగాలి కొట్టగానే కోకజారే పడలేని ఆరాటం... చందమామ కన్నుగొట్టె సందెవేళ సిగ్గుమల్లె పూలుపెట్టె చీకటేల మంచెకాడుంది రారా పంచదార మాపటేల తోడుపెట్టేసుకోర పొంగులన్ని పాలవేల చరణం: 1 జాజిమల్లి మంచునీకు జల్లుకుంట కొత్త నాగమల్లి తీగలాగ అల్లుకుంటా వాలింది పొద్దు - వడ్డించు ముద్దు తప్పులెన్ని చేసుకున్న ఒప్పుకుంటా నువ్వు తప్పుకుంటే తిప్పలెట్టి తిప్పుకుంటా కౌగిళ్ళు పట్టు - కవ్వింత కొట్టు నీషా కళ్ళ నీడలో హుషారైన ఓ కల ఓ రసాలమ్మ కోనలో పసందైన ఆకలా చలి తీరాలి సాయంత్రం చందమామ కన్నుగొట్టె సందెవేళ సిగ్గుమల్లే పూలుపెట్టె చీకటేల మంచెకాడుంది రారా పంచదార మాపటేల తోడుపెట్టేసుకోర పొంగులన్ని పాలవేల చరణం: 2 మొక్కజొన్న తోటకాడ మొక్కుకుంటా పాలబుగ్గలోని మొగ్గలన్ని ఇచ్చుకుంటా జాబిల్లి జంట - జాగారమంట చీరకున్న సిగ్గులన్ని దోచుకుంటా నీకు బిర్రుపట్టు రైకలెట్టి చూసుకుంటా శ్రీ కంచి పట్టు - స్త్రీ కన్ను కొట్టు హాయ్ గులాబీల తోటలో కులసాలు పండని హ పెదాలమ్మ పేటలో పదలెన్నో పాడని చిలకమ్మ నీకోసం చందమామ కన్నుగొట్టె సందెవేళ సిగ్గుమల్లె పూలుపెట్టె చీకటేల మంచెకాడుంది రావే పంచదార మాపటేల తోడుపెట్టేసుకుంటా పొంగులన్ని పాలవేల అందమంత ఆరబెట్టె పైటజారే కోడిగాలి కొట్టగానే కోకజారే పడలేని ఆరాటం...

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Dongalludu

See All