MovieGQ

Chilipi Chirugali

Dongaata (1997) · Track 1 of 5

Lyrics

కోరస్: తస్స చెక్క తద్దినక చిందెనుగా సందడిగా చెంగుమనే రంగ రంగేళి చెమ్మచెక్క చూడ చుక్క తుళ్ళేనుగ అల్లరిగా కంగుమనే కుర్ర కవాళి పాపాలు సవాలంటరా బావలు సత్తా చూస్తరా గోడమీద బల్లి ఏమంది పడుచు బుల్లి పాత ప్రశ్నలెందుకన్నది పల్లవి: చిలిపి చిరుగాలి పాడాలి కొత్త పాట చిలిపి చిరుగాలి పాడాలి కొత్త పాట జడ్లోని సిరిమల్లి ఆడాలి కొంటె ఆట ఆ ఆట పాట చూసి సరదాకే సరదా వేసి కోనంగి ప్రశ్నలేన్నో అడగాలి... ఓ..ఓ..ఓ.. మేము రెడీ ఓ..ఓ..ఓ.. కానీ మరి చిలిపి చిరుగాలి పాడాలి కొత్త పాట చరణం: 1 కొమ్మంటు ఎరుగని పూలెన్నో ఉన్నవి వాటిని ఏవంటారు ఏనాడు చెరగని చిరునవ్వులే అవి కాదని ఎవరంటారు కోరస్: పక్కుమంటూ నవ్వి వప్పుకుంటాం చెప్పమంటూ ఇంకో చిక్కు వేస్తాం దేవుడికి పువ్వులిచ్చి ముల్లివ్వమంటూ అడిగేవాలెవ్వరుంటారు పెళ్లీడు మీద పడ్డ కన్నెపిల్లలంతా ఆ మూడు ముళ్ళు కోరతారు బాగానే సెలవిచ్చారు మీ మగవాళ్ళింకేస్తారు మీ నోచే నోముల ఫలితం మేమంటారు ఓ..ఓ..ఓ.. ఎం పొగరు ఓ..ఓ..ఓ.. తగ్గిందా జోరు చిలిపి చిరుగాలి పాడాలి కొత్త పాట చరణం: 2 ఏటిలో తను ఈతాడుతున్న తడవనే తడవదేది నీటిలో పడు నీ నీడ కన్న ఇంక వేరేముంది కోరస్: అమ్మలాల ఇట్టే చెప్పినాడే అప్పుడేనా ఇంకావుంది చూడే కన్నుల్ని మూసి చూస్తే కనిపించుతుంది ఆ చిత్రం ఏమిటైయుంటుంది నీలాల కన్నుపాప నిదురించ గానే కలవచ్చి కనబడుతుంది నీ కమ్మని కల ఏమంది ఏ కబుర్లు చెబుతూ ఉంది ఇవ్వాలో రేపో నిజమై వస్తానంది ఓ..ఓ..ఓ.. ఇంకేమ్మరి ఓ..ఓ..ఓ.. రానీ మరి చిలిపి చిరుగాలి పాడాలి కొత్త పాట ఆ ఆట పాట చూసి సరదాకే సరదా వేసి కోనంగి ప్రశ్నలేన్నో అడగాలి ఓ..ఓ..ఓ.. మేము రెడీ ఓ..ఓ..ఓ.. కానీ మరీ చిలిపి చిరుగాలి - పాడాలి కొత్త పాట ఆడాలి కొంటె ఆట - పాడాలి కొత్త పాట

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Dongaata

See All