Song Details
Lyrics
ఓ గోపెమ్మో.. ఇటు రావమ్మో ఈ దాసుని తప్పు దండంతో సరి మన్నించవమ్మో ఓ కిష్టయ్యో రాను పోవయ్యో నీ గడసరి మాటలు గారడి చేష్టలు చాలించవయ్యో... ఓ గోపెమ్మో.. ఇటు రావమ్మో సొగసే నీ అలకలు కూడా సొగసే ఓ ముద్దుల గుమ్మా ఈ ఒకసారికి చిరాకు పరాకు పడబోకే... తెలుసే ఇది రోజూ ఉండే వరసే చిరు చీకటి పడితే.. కౌగిట చేరగ తపించి తపించి పోతావే? న్యాయము కాదిది.. సమయము కాదిది.. న్యాయము కాదిది.. సమయము కాదిది.. గోపెమ్మో ఇటు రావమ్మో ఈ దాసుని తప్పు దండంతో సరి మన్నించవమ్మో నీ గడసరి మాటలు గారడి చేష్టలు చాలించవయ్యో... ఓ కిష్టయ్యో రాను పోవయ్యో మదిలో తొలిరాతిరి తలపే మెదిలే నిను చూస్తూ ఉంటే ఎదలో కోరిక కలుక్కు కలుక్కు మంటుంటే... ఇపుడే ఈ సరసాలన్నీ ఇపుడే ఈ ముచ్చటలన్నీ మురిపము తీరగ హుళక్కి హుళక్కి అవుతాయే నమ్మవే నా చెలి.. నమ్మకమేమిటి? నమ్మవే నా చెలి.. నమ్మకమేమిటి? గోపెమ్మో.. ఊ.. ఇటు రావమ్మో..ఊ.. ఈ దాసుని తప్పు దండంతో సరి మన్నించవమ్మో ఈ దాసుని తప్పు దండంతో సరి మన్నించవమ్మో ఓ కిష్టయ్యో రాను పోవయ్యో నీ గడసరి మాటలు గారడి చేష్టలు చాలించవయ్యో... ఈ గడసరి మాటలు గారడి చేష్టలు చాలించవయ్యో... ఓ గోపెమ్మో.. రాను పోవయ్యో ఓ గోపెమ్మో.. రాను పో...వయ్యో...
Lyrics sourced from public databases. May contain errors.