MovieGQ

Paruvala Pavurama

Deevinchandi (2001) · Track 2 of 6

Song Details

Lyrics

పారువాల పావురమా పైటున్న పసితనమా వందేళ్ళ నా వరమా అందాల నందనమా నీ నవ్వులే నా వెన్నెలా నా ఊపిరే నీ ఊయలా ఏ నోము నోచినదమ్మా నీ ప్రేమ పొందిన జన్మా నీ నీడగా నడిపించుమా ....... నా ప్రాణమై మురిపించుమా..... పారువాల పావురమా పైటున్న పసితనమా నీ నవ్వులే నా వెన్నెలా......... నువ్వొచాకనే.. తొలిసారిగా.. ఉగాదొచ్చి వాలింది నా వాకిటా.. మనని చూడగా కనువిందుగా.. మనింట్లోనె ఉంటుంది ప్రతీ పండుగా. ఏదో మాయగా ఉంది ఈ వింత సంతోషం ఎంతో తియ్యగా ఉన్నది ఈ కొత్త సంసారం ఏకాకి యాత్రలో.. ఏకైక బంధమా.. నీకోసమే...... నేనున్నదీ....... నా జీవితం.... నీదైనదీ........ వందేళ్ళ నా వరమా అందాల నందనమా నా ఊపిరే.. నీ ఊయలా..... నిజంగా ఇదీ కలకాదుగా.. కలైపోయి ఏనాడు వెళ్లిపోదుగా. ఇలా నువ్వు నా జతచేరగా.. కలే నిజమైందేమో అనిపించదా. మెడలో తాళిగా వాలెగా కోటి పుణ్యాలు వడిలో పాపగా ఉండిపో నిండు నూరేళ్ళు మా అమ్మ పంపినా స్వర్గాల దీవెనా నీ రుపమై.. కనిపించెనా.. నా కుంకుమై.. కరునించెనా.. పారువాల పావురమా పైటున్న పసితనమా వందేళ్ళ నా వరమా అందాల నందనమా నీ నవ్వులే నావెన్నెలా నా ఊపిరే నీ ఊయలా ఏనోము నోచినదమ్మా నీ ప్రేమ పొందిన జన్మా నీ నీడగా నడిపించుమా ....... నా ప్రాణమై మురిపించుమా.....

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Deevinchandi

See All