Song Details
Lyrics
భూగోళంతో బంతాట ఆడాలంది మన పాదం పూబాణంలా అందాలే వేటాడాలంది ప్రాయం పడిలేస్తూ మనవెనకాలే తడబడిపోతుంటే కాలం ఆనందోబ్రహ్మ అంది మన వేగం కథలోకింక అద్భుతం ఎదురయేదాక వెతుకుదాం పదమందీ నవయవ్వనంలో పసితనం దొరుకుతుందా అది అడగదే మన నమ్మకం కలనైనా తరిమేగుణం మన లక్షణం నిజమైనా కలలాంటిదే మనకీక్షణం అదుపులోలేని పరుగులం రసతరంగాన ఉరుములం మనకింకా తెలియదు కద భయమన్నది పిల్లగాలై ఎదురేగుదాం గగనానికి ఎగరేద్దాం చిరునవ్వుని నలువైపులా స్వాగతిస్తాం స్వర్గాలనే మనవైపిలా
Lyrics sourced from public databases. May contain errors.