MovieGQ

Oohala Pallaikilo

Chitram (2000) · Track 6 of 6

Song Details

Singers
Music Director
Lyricist

Lyrics

ఊహల పల్లకీలో ఊరేగించన ఆశల వెల్లువై రాగం పలికించనా ఊహల పల్లకీలో ఊరేగించన ఆశల వెల్లువై రాగం పలికించనా కలహంసై కబురులు నింపనా రాచిలకై కిలకిల నవ్వనా నా పెదవుల మధువులె ఇవ్వనా సయ్యాటలోనా... ఊహల పల్లకీలో ఊరేగించనా ఆశల వెల్లువై రాగం పలికించనా ప్రేమలో తీపి చూసే వయసే నీదిరా బ్రతుకులో చేదులున్నా భయమే వద్దురా సుడిగుండం కాదురా సుమగంధం ప్రేమరా పెనుగండం కాదురా అనుబంధం ప్రేమరా సిరి తానుగానే వచ్చి నిన్ను చేరునురా... ఊహల పల్లకీలో ఊరేగించనా ఆశల వెల్లువై రాగం పలికించనా మేఘాలకు నిచ్చెనె వేయన ఆకాశపుటంచులే వంచన ఆ జాబిలి కిందకే దించనా... నా కన్నెకూనా... ఊహల పల్లకీలో ఊరేగించనా ఆశల వెల్లువై రాగం పలికించనా ఆశగా పల్లవించే పాటే నీవులే జీవితం తోడులేని మోడే కాదులే కలిసుండె వేళలో కలతంటు రాదులే అమవాసై పోదులే అడియాసే కాదులే చిరు దివ్వె గొంతు ఇంక దారి చూపునులే ఊహల పల్లకీలో ఊరేగించనా ఆశల వెల్లువై రాగం పలికించనా మేఘాలకు నిచ్చెనె వేయన ఆకాశపుటంచులే వంచన ఆ జాబిలి కిందకే దించనా నా కన్నెకూనా... ఊహల పల్లకీలో ఊరేగించనా ఆశల వెల్లువై రాగం పలికించనా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Chitram

See All