MovieGQ

Kurisindi Chirujallu

Chirujallu (2001) · Track 6 of 6

Lyrics

పల్లవి: కురిసింది చిరుజల్లు నీలో అల్లరిలా విరిసింది హరివిల్లు నీ చిరునవ్వుల్లా చినుకుల్ని స్వాగతించే ఈ మట్టి వాసనలా చిగురుల్నే మేలుకొలిపే సరికొత్త సరిగమల చిన్ననాటి అల్లర్ల తడి జ్ఞాపకంలా కురిసింది చిరుజల్లు నీలో అల్లరిలా చరణం: 1 నీ సరదాలన్నీ నా గుండెల్లో గువ్వలై వాలని నీ కిలకిలలన్నీ నా కన్నుల్లో పువ్వులై విరియని దివినుంచి తారకలన్ని దిగివచ్చేనా మనకోసం వరములు ఎన్నో అందించేనా ఆశలకే అవానమై నిను పిలిచా ఆషాడమై పురివిరిసే మయూరమై బదులిచ్చా నీకోసమై ఆ బదులే నా మదికి ముత్యాల జల్లు కురిసింది చిరుజల్లు నీలో అల్లరిలా చరణం: 2 నా ఏకాంతంలో వినిపించాయి ఘల్ అని మువ్వలు నీ సావాసంలో చిగురించాయి ఝల్లనే ఊసులు నువుమీటిన సంతోషాల శ్రావణవీణ నిలువెల్లా కరిగిస్తుంది అనురాగాన అడుగులలో నయాగర కనిపించే ఉత్సహమై ఎద సడిలో సుధా స్వరం పలికించే సంగీతమై మనసంత మురిపించె ఈ తేనె ముళ్ళు కురిసింది చిరుజల్లు నీలో అల్లరిలా చినుకుల్ని స్వాగతించే ఈ మట్టి వాసనలా చిగురుల్నే మేలుకొలిపే సరికొత్త సరిగమల చిన్ననాటి అల్లర్ల తడి జ్ఞాపకంలా విరిసింది హరివిల్లు నీ చిరునవ్వుల్లా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Chirujallu

See All