Chamanti Poobanthi
Song
Movie
-
Music Director
-
Lyricist
-
Singers
- S.P. Balasubrahmanyam
Lyrics
- చామంతి పూబంతి వాసంతి రావే
సిరిబంతి నీ ఇంటి నావన్ని నీవే
ఏమున్నాదో నీ గురించి తపించు మనస్సులో
ఏమన్నాదో నిను వరించి తరించు వయస్సులో
ప్రేమించే ప్రాణమ భావమ
మోహించే ప్రణయ రాగ స్వరమ
చామంతి పూబంతి వాసంతి రావే
సిరిబంతి నీ ఇంటి నావన్ని నీవే
ఓ ఓ ఓ... - ఓ ఓ ఓ...
ఆ... - ఆ...
కొంచమైన తాళలేక పొంచివున్న ఆశలన్ని
కంచె దాటున కసి పెంచి రేగునా
మించిపోయి అంచుదాటె తెంచలేని హాయినంత
పంచిపెట్టన రుచి పెంచి ఇవ్వనా
ఆ పొద్దు ఈ పొద్దు ఆపద్దు నీ ముద్దు
దూరంగ పోవద్దు భామ
ఆలశ్యమేవద్దు ఏమాత్రమాగొద్దు
ఈ హద్దులే వద్దు కామ
రావే...సొగసరి మరి మరి విరిసిన తొలి విరి
నీకే నేను కుదిరి అదిరి
చామంతి పూబంతి వాసంతి రావే
సిరిబంతి నీ ఇంటి నావన్ని నీవే
ఆకుచాటు సోకులన్ని రేకువిప్పు వన్నెలన్ని
అందజేయనా జత పొందు చేరనా
ఓ ఓ ఓ ఓ
గోరువెచ్చనైనా తేనే దోరముద్దు లోనే పంచి
చెంత చేరనా మరి కొంత కోరనా
జడ్లోన పూలన్ని పక్కల్లో రాలేటి
రాత్రిళ్ళకై నేను వేచా
కల్లోన ఓ కామ కల్లోలమే రేగి
కల్లారగ నేడు చూశా
ఏదో తెలియని అలజడి కలిగిన అలికిడి
నాలో కలలు కదలి మెదలి
చామంతి పూబంతి వాసంతి రావే
సిరిబంతి నీ ఇంటి నావన్ని నీవే
ఏమున్నాదో నీ గురించి తపించు మనస్సులో
ఏమన్నాదో నిను వరించి తరించు వయస్సులో
ప్రేమించే ప్రాణమ భావమ
మోహించే ప్రణయ రాగ స్వరమ
Chilakkottudu
Movie More SongsChamanti Poobanthi Keyword Tags
-
-