Song Details
Lyrics
అల్లిబిల్లి కలలా రావే అల్లుకున్న కధలా రావే మల్లెపూల చినుకై రావే పల్లవించు పలుకై రావే వేచే ఎదలో వెలుగై రావే అల్లిబిల్లి కలలా రానా అల్లుకున్న కధలా రానా మల్లెపూల చినుకై రానా పల్లవించు పలుకై రానా వేచే ఎదలో వెలుగై రానా అల్లిబిల్లి కలలా రావే అల్లుకున్న కధలా రావే అల్లిబిల్లి కలలా చరణం: 1 సోగకళ్ళ విరిసే సొగసే గోగుపూలు కురిసే రాగమైన పిలుపే తెలిపే మూగగుండె వలపే రెప్పచాటు చూపే నేడు రెక్కలొచ్చి ఎగిసే నిన్న కన్న కలలే నేడు నిన్ను కోరి నిలిచే ఏలబిగువా ఏలుకొనవా ప్రేమకధ వినవా అల్లిబిల్లి కలలా రానా అల్లుకున్న కధలా రానా అల్లిబిల్లి కలలా చరణం: 2 జావళీలు పాడే జాణ జాబిలమ్మ తానై గుండె నిండిపోయే చానా వెండిమబ్బు తానై సంగతేదో తెలిపే పలపే సంగతేదో పలికే దూరమింక చెరిపే వలపే దోరనవ్వు చిలికే మేనికుళుకే తేనెచినుకై పూలజల్లు కురిసే అల్లిబిల్లి కలలా రావే అల్లుకున్న కధలా రావే అల్లిబిల్లి కలలా రానా అల్లుకున్న కధలా రానా మల్లెపూల చినుకై రావే పల్లవించు పలుకై రావే వేచే ఎదలో వెలుగై రానా అల్లిబిల్లి కలలా రావే అల్లుకున్న కధలా రానా అల్లిబిల్లి కలలా
Lyrics sourced from public databases. May contain errors.