MovieGQ

Nannu Lalinchu

Cheppave Chirugali (2004) · Track 2 of 7

Song Details

Lyrics

నన్ను లాలించు సంగీతం నువ్వే కదా నిన్ను పాలించు సంతోషం నేనే కదా నువ్వు చిరుగాలివా లేక విరివానవా మరి ఆ నింగి ఈ నేల నిప్పే నువ్వా లేకా నేనే నువ్వా నన్ను లాలించు సంగీతం నువ్వే కదా నిన్ను పాలించు సంతోషం నేనే కదా నదిలాగ నువ్వూ కదలాడతుంటే నీతోపాటూ సాగేతీరం నేనవ్వనా నిశిరాత్రి నీవు నెలవంక నేను నీతోపాటూ నిలిచే కాలం చాలందునా మొగ్గై ఎదురొచ్చీ వనముగ మారావూ కలలే నాకిచ్చీ కనులను దోచావూ ఎదలయలోన లయమయ్యే శృతివే నువ్వు నా బ్రతుకే నువ్వూ నన్ను లాలించు సంగీతం నువ్వే కదా నిన్ను పాలించు సంతోషం నేనే కదా భువిలోన గాలి కరువైన వేళ నా ప్రాణాన్ని నీ ఊపిరిగా మార్చేయనా నీలాల నింగీ తెలవారకుంటే నా జీవాన్నీ నీకూ దివ్వెగ అందించనా శిలలా మౌనంగా కదలక పడివున్నా అలలా నువు రాగా అలజడినౌతున్నా దీపం నువ్వైతె నీ వెలుగు నేనవ్వనా నీలో సగమవ్వనా నన్ను లాలించు సంగీతం నువ్వే కదా నిన్ను పాలించు సంతోషం నేనే కదా నువ్వు చిరుగాలివా లేక విరివానవా మరి ఆ నింగి ఈ నేల నిప్పే నువ్వా లేకా నేనే నువ్వా నన్ను లాలించు సంగీతం నువ్వే కదా నిన్ను పాలించు సంతోషం నేనే కదా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Cheppave Chirugali

See All