Song Details
Lyrics
పల్లవి: ఆ అహహాహా... ఆ..... ఉత్తరాన లేవంది ధృవనక్షత్రం దక్షిణాన లేవంది మలయపర్వతం నింగిలేని తారకా .. నీవెక్కడా .. నీ వెక్కడా చెప్పవే నీ చిరునామా .. చెప్పవే నీ చిరునామా ఉత్తరాన లేవంది ధృవనక్షత్రం దక్షిణాన లేవంది మలయపర్వతం చరణం: 1 చుక్కపాపనడిగాను వెన్నెలమ్మ ఏదనీ... పిల్లగాలినడిగాను పూలకొమ్మ ఏదనీ... జాణవున్న తావునే జాజిమల్లి తావులు ప్రాణమున్న చోటుకే పరుగులెత్తు ఆశలూ వెతికాయీ నీ చిరునామా.. వెతికాయీ నీ చిరునామా.. తెలుపరాదటే ఓ ప్రియభామా... ఉత్తరాన లేవంది ధృవనక్షత్రం దక్షిణాన లేవంది మలయపర్వతం చరణం: 2 ఈ నిశీధి వీధిలో బాటసారినై... ఈ విశాల జగతిలో బ్రహ్మచారినై... నీ దర్శన భాగ్యమే కోరుకున్న కనులతో నీ సన్నిధి కోసమే బ్రతుకుతున్న కలలతో వెతికానూ నీ చిరునామా.. వెతికానూ నీ చిరునామా.. తెలుపరాదటే ఓ ప్రియభామా... ఉత్తరాన లేవంది ధృవనక్షత్రం దక్షిణాన లేవంది మలయపర్వతం నింగిలేని తారకా .. నీవెక్కడా .. నీ వెక్కడా చెప్పవే నీ చిరునామా .. చెప్పవే నీ చిరునామా
Lyrics sourced from public databases. May contain errors.