MovieGQ

Sayamkalam Sagara Teeram

Challenge (1984) · Track 5 of 5 · 4:11

Song Details

Lyrics

పల్లవి: సాయంకాలం సాగర తీరం నా చెలి వొళ్ళో చలి సందళ్ళో రోజూ మోజుగా జల్సా చేయరా విరజాజిపూల గంధమంటి అందమంత నీదిరా సాయంకాలం సాగర తీరం వెచ్చని వొళ్ళో వెన్నెల గుళ్ళో తాజా మోజులే రోజూ చూడరా నడి రాతిరల్లే పగటిపూట రాసలీలలాడరా చరణం: 1 కాపురమొస్తే కాదంటానా కౌగిలి నీకే లేదంటానా కాపురమొస్తే కాదంటానా కౌగిలి నీకే లేదంటానా కవ్వించి నవ్వించి కసితీరా కరిగించి కథకాస్త నడిపించనా మరుమల్లె మరి విచ్చుకునే వేళ లాలాలలాల కళ్ళుమరీ గిచ్చుకునే వేళ లాలాలలాల కళ్ళుమరీ గిచ్చుకునే వేళ లాలాలలాల రానంటానా పొదరింటికి పూతకొచ్చి పండుతున్న పులకరింత వేళకి చరణం: 2 సిగ్గని చెప్పి పొమ్మంటానా చక్కెర విందు లేదంటానా సిగ్గని చెప్పి పొమ్మంటానా చక్కెర విందు లేదంటానా రేపంటూ మాపంటూ అంతటితో ఆపంటూ తెల్లారిపోనిస్తానా లాలాలలాల చెలిగాలి మరి చంపితినే వేళ లాలాలలాల జంట చలి పెంచుకునే వేళ లాలాలలాల జంట చలి పెంచుకునే వేళ లాలాలలాల రమ్మంటావా సందిళ్ళకి ఒంటిగుండి చావలేనె సలపరింత గోలకి సాయంకాలం సాగర తీరం నా చెలివొళ్ళో చలి సందళ్ళో తాజా మోజులే రోజూ చూడరా విరజాజిపూల గంధమంటి అందమంత నీదిరా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Challenge

See All