Paapa Eedu Gola
Song
Movie
-
Music Director
-
Lyricist
-
Singer
-
Lyrics
- పాప ఈడు గోలా.. పాట పేరు జోలా
ఊగుతోంది బాల... యవ్వనాల డోలా
నీవు వేణువైతే.. నేను ఊపిరౌతా
మోగాలి ఎదలో ఈల.. మోహాల సరి రాగాలా
Be happy... happy all the time...
Be happy... happy all the time...
Be happy... happy all the time...
Be happy... happy all the time...
ఏదో సాగింది చిలిపి కథా
ఓటమి గెలుపైన వలపు కథా
కునుకే రాకున్న కనుల కథా
ఉడికే పరువాల పడుచు కథా
పూసేటి వేసంగి పూరేకులో
రాస్తాను నీ పేరు తేనెలతో
తెన్నేటి ఇసుకమ్మ తీరాలలో
వేస్తాను పాదాలు నీ జతలో
పాషాణమై పోకు వైఢూర్యమా
పాప ఈడు గోలా..పాట పేరు జోలా
ఊగుతోంది బాల...యవ్వనాల డోలా
ఆటే కారాదు బ్రతుకు సుమా
అతికే మనసంటు లేదు సుమా
చేతులు కలిపింది చెలిమి సుమా
ఎగిరే నా ప్రేమ పావురమా
ఆనాటి స్నేహాల వాకిళ్ళలో
ఈనాడు వేచేను దోసిలి తో
కాలాలు దాటాను కౌగిళ్ళలో
స్వర్గాలు చూడాలి నీ ఒడిలో
శిల నీవు కాబోకు శృంగారమా
పాప ఈడు గోలా.. పాట పేరు జోలా
ఊగుతోంది బాల... యవ్వనాల డోలా
నీవు వేణువైతే.. నేను ఊపిరౌతా
మోగాలి ఎదలో ఈల.. మోహాల సరి రాగాలా
Be happy... happy all the time
Be happy... happy all the time
Be happy... happy all the time
Be happy... happy all the time
- పాప ఈడు గోలా.. పాట పేరు జోలా
Chaitanya
Movie More SongsPaapa Eedu Gola Keyword Tags
-
-
-