MovieGQ

Kalakalam Ide Sagani

Captain Krishna (1979) · Track 2 of 3

Lyrics

పల్లవి: ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ ఏహే..హె..హే....ఆ..ఆ..హా..ఆ...ఆ.. కలకాలం ఇదే పాడనీ.. నీలో నన్నే చూడనీ... కలకాలం ఇదే పాడనీ.. నీలో నన్నే చూడనీ... చరణం: 1 నీ... వలపుల లోగిలిలో విహరించనీ... నీ... వెచ్చని కౌగిలిలో నిదురించనీ... నీ... వలపుల లోగిలిలో విహరించనీ... నీ... వెచ్చని కౌగిలిలో నిదురించనీ.. నీ నయనాలలో నను నివశించనీ... నీ నయనాలలో నను నివశించనీ... మన ప్రేమనౌక ఇలా సాగనీ.... కలకాలం ఇదే పాడనీ... నీలో నన్నే చూడనీ... చరణం: 2 జన్మ జన్మల నీ హృదయరాణినై ఈ అనుబంధం పెనవేయనీ... జన్మ జన్మల నీ హృదయరాణినై ఈ అనుబంధం పెనవేయనీ... ఈ ప్రేమ గీతికా ఒక తీపి గురుతుగా నా కన్నులలో వెన్నెలలే కురిపించనీ నీడల్లె నీ వెంట నేనుండగా బ్రతుకంత నీతోనే పయణించగా కలకాలం ఇదే పాడనీ.... నీలో నన్నే చూడనీ... చరణం: 3 ఈ జంటకు తొలిపంట ఈ రూపము నా కంటికి వెలుగైన చిరుదీపము ఈ జంటకు తొలిపంట ఈ రూపము నా కంటికి వెలుగైన చిరుదీపము ఈ చురునవ్వులే వేయి సిరిదివ్వెలై ఈ చురునవ్వులే వేయి సిరిదివ్వెలై వెలగాలి కోటి చందమామలై.... కలకాలం ఇదే పాడనీ.... నీలో నన్నే చూడనీ.... కలకాలం ఇదే పాడనీ.... నీలో - నన్నే చూడనీ...

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Captain Krishna

See All