Anaganaganaga
Song
Movie
-
Music Director
-
Lyricist
-
Singers
- K.K.
Lyrics
- అనగనగనగా మనసున మెరుపే మెరిసిన తరుణంలో
మెరుపుల వెనుక చిరు చిరు చినుకే కురిసిన సమయంలో
మెరుపు వెలుగులతో చినుకు పిలుపులతో
తెరవని తలుపులు తెరిచిన క్షణమున
ధీంతార ధిరనా తక ధింతతార ధిరనా
కొత్త ప్రేమ తపన మొలకెత్తు ఇందు వలన
తెలిసిన కధలో కలసిన తిధిలో
తిరగని మలపులు తిరిగిన క్షణమున
ధీంతార ధిరనా తక ధింతతార ధిరనా
పిచ్చి ప్రేమ తపన పురి విప్పే ఇందు వలన
కుంకుమ పువ్వుకు కాటుక రేఖవనా
కోరిన ప్రియునికి కౌగిలి లేఖవనా
నీలినింగిని వదిలి ఆ తారలిటు కదిలి
చేరుకున్నవి మజిలి నీ చెలిమి పెన్నిధి తగిలి
జిలిబిలి తార ఎద గగనమున
జాబిలి తీరుగ ఎదిగిన క్షణమున
ధీంతార ధిరనా తక ధింతతార ధిరనా
పిచ్చి ప్రేమ తపన పురివిప్పే ఇందు వలన
నచ్చిన చేతికి గోరింటాకవనా
నల్లని రేయికి వెన్నెల పడకవనా
కొద్దిగ ఇటు జరిగి నా ముద్దులో మునిగి
నవ్వవా అటు తిరిగి నేనివ్వలేనిది అడిగి
అడుగు కలిపి నడుమును కొలిచి
నడవని దారిన నదచిన క్షణమున
ధీంతార ధిరనా తక ధింతతార ధిరనా
పిచ్చి ప్రేమ తపన పురివిప్పే ఇందు వలన
అనగనగనగా మనసున మెరుపే మెరిసిన తరుణంలో
మెరుపుల వెనుక చిరు చిరు చినుకే కురిసిన సమయంలో
మెరుపు వెలుగులతో చినుకు పిలుపులతో
తెరవని తలుపులు తెరిచిన క్షణమున
ధీంతార ధిరనా తక ధింతతార ధిరనా
Boss
Movie More SongsAnaganaganaga Keyword Tags
-
-