Song Details
Lyrics
ఉరికే చిలకా వేచి ఉంటాను కడవరకు కురిసే చినుకా ఎల్లువైనావె ఎదవరకు చెలివై సఖివై రెండు హృదయాల కథలు విను బ్రతుకే బరువై నిండు విరహాల కబురు విను కాటుకా కళ్ళతో కాటు వేశావు నన్ను ఎపుడో కాలం చెల్లితే ఇంత మన్నేసిపో ఇపుడూ ఉరికే చిలకా వేచి ఉంటాను కడవరకు కురిసే చినుకా ఎల్లువైనావె ఎదవరకు నీ రాక కోసం తొలిప్రాణమైన దాచింది నా వలపే మనసంటి మగువ ఏ జాము రాక చితి మంటలే రేపే నా కడప్రాణం పోనివ్వు కథ మాసిపోదు అది కాదు నా వేదనా విధి విపరీతం నీ మీద అపవాదు వేస్తే ఎద కుంగి పోయేనులే మొదలో తుదలో వదిలేశాను నీకే ప్రియా ఉరికే చిలకే వచ్చి వాలింది కలత విడి చెలిగా సఖిలా తాను చేరింది చెలుని ఒడి నెలవే తెలిపే నిన్ను చేరింది గతము విడి కలకీ ఇలకీ ఊయలూగింది కంటపడీ కాటుకా కళ్ళతో కాటు వేశావు నన్నెపుడో కాలం చెల్లితే ఇంత మన్నేసిపో ఇపుడూ ఉరికే చిలకా వేచి ఉంటాను కడవరకు కురిసే చినుకా ఎల్లువైనావె ఎదవరకు తొలిప్రాణమైన ఒకనాటి ప్రేమ మాసేది కాదు సుమా ఒక కంటి గీతం జలపాతమైతే మరు కన్ను నవ్వదమ్మా నా పరువాల పరదాలు తొలగించి వస్తే కన్నీటి ముడుపాయెనే నే పురివిప్పి పరుగెత్తి గాలల్లె వచ్చా నీ వేణు గానానికే అరెరే అరెరే నేడు కన్నీట తేనె కలిసే ఉరికే చిలకా వేచి ఉంటాను కడవరకు కురిసే చినుకా ఎల్లువైనావె ఎదవరకు చెలివై సఖివై రెండు హృదయాల కథలు విను బ్రతుకే బరువై నిండు విరహాల కబురు విను మోహమో మైకమో రెండు మనసుల్లొ విరిసినదీ పాశమో బంధమో ఉన్న దూరాలు చెరిపినదీ ఉరికే చిలకే వచ్చి వాలింది కలత విడి నెలవే తెలిపే నిన్ను చేరింది గతము విడీ
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Bombay
See AllAdi Arabi Kadalandam
Remo Fernandes, Swarnalatha Jr.
Kannanule
K.S. Chithra, A.R. Rahman
Kuchi Kuchi Koonamma
Hariharan, Swarnalatha Jr., G.V. Prakash Kumar, Shweta Mohan
Poolakundi Komma
S.P. Pallavi, Malgudi Subha, Anupama, Noel James, Jeans Srinivas
Kulamela Mathamela
Sujatha Mohan
Bombay Theme
-
Idhu Maathrubhoomi
Sujatha Mohan, Noel James, Jeans Srinivas, Sivanesan, Ganga Sreenivasan, Renuka, Anuradha Sriram