Song Details
Lyrics
కన్యాకుమారీ కనపడదా దారి కయ్యాలమారి పడతావే జారి పాతాళం కనిపెట్టేలా ఆకాశం పనిపట్టేలా ఊగకే మరి మతి లేని సుందరి జింగి చక్ జింగి చక్ చా చక్ జింగి చక్ జింగి చక్ చా గోపాలబాలా ఆపర ఈ గోల ఈ కైపు ఏలా ఊపర ఉయ్యాలా మైకంలో మయ సభ చూడు మహరాజా రాణా తోడు సాగనీ మరి సరదాల గారడి జింగి చక్ జింగి చక్ చా చక్ జింగి చక్ జింగి చక్ చా కొండలు గుట్టలు చిందులాడే తధికినతోం వాగులు వంకలు ఆగి చూసే కథ చెబుదాం తూనీగ రెక్కలెక్కుదాం సూరీడి పక్క నక్కుదాం ఊదేటి కొమ్ము వెతుకుదాం బంగారు జింకనడుగుదాం చూడమ్మో… హంగామా… అడివంతా రంగేద్దాము సాగించే వెరైటీ ప్రోగ్రాం కళ్ళ విందుగా పైత్యాల పండగ జింగి చక్ జింగి చక్ చా చక్ జింగి చక్ జింగి చక్ చా ఆ.. కన్యాకుమారీ కనపడదా దారి కయ్యాలమారి పడతావే జారి మైకంలో మయ సభ చూడు మహరాజా రాణా తోడు సాగనీ మరి సరదాల గారడి జింగి చక్ జింగి చక్ చా చక్ జింగి చక్ జింగి చక్ చా డేగతో ఈగలే ఫైటు చేసే చెడుగుడులో చేపలే చెట్టుపై పళ్ళు కోసే గడబిడలో నేలమ్మా తప్ప తాగెనో ఏ మూల తప్పిపోయనో మేఘాల కొంగు పట్టుకో తూలేటి నడకనాపుకో ఓయమ్మో… మాయమ్మో… దిక్కుల్నే ఆటాడించే కిక్కుల్లో గందరగోళం ఒళ్ళు ఊగగా ఎక్కిళ్ళు రేగగా ఏయ్...గోపాలబాలా ఆపరా ఈ గోల ఈ కైపు ఏలా ఊపర ఉయ్యాలా ఆ పాతాళం కనిపెట్టేలా ఆకాశం పనిపట్టేలా ఊగకే మరి మతి లేని సుందరీ జింగి చక్ జింగి చక్ చా చక్ జింగి చక్ జింగి చక్ చా ఆ.. సాగనీ మరి సరదాల గారడి
Lyrics sourced from public databases. May contain errors.