MovieGQ

Janani Janmabhoomischa

Bobbili Puli (1982) · Track 4 of 6 · 4:43

Song Details

Lyrics

జననీ జన్మ భుమిశ్చ స్వర్గాదపీ గరీయసీ స్వర్గాదపీ గరీయసీ ఏ తల్లి నిను కన్నదో? ఏ తల్లి నిను కన్నదో? ఆ తల్లినే కన్న భూమి గొప్పదిరా జననీ జన్మ భుమిశ్చ స్వర్గాదపీ గరీయసీ స్వర్గాదపీ గరీయసీ చరణం: 1 నీ తల్లి మోసేది నవమాసాలేరా ఈ తల్లి మోయాలి కడవరకు రా కట్టే కాలే వరకు రా ఆ ఋణం తలకొరివి తో తీరేను రా ఈ ఋణం ఏ రూపాన తీరేది రా ఆ రూపమే ఈ జవాను రా త్యాగానికి మరో రూపు నువ్వు రా జననీ జన్మ భుమిశ్చ స్వర్గాదపీ గరీయసీ స్వర్గాదపీ గరీయసీ చరణం: 2 గుండె గుండెకు తెలుసు గుండె బరువెంతో ఆ గుండెకే తెలుసూ గుండె కోత బాదెంతో నీ గుండె రాయి కావాలి... ఆ గుండెల్లో ఫిరంగులు మోగాలి మనిషిగా పుట్టిన ఓ మనిషీ మారాలి నువ్వు రాక్షసుడిగా మనుషుల కోసం... ఈ...మనుషుల కోసం... నీ మనుషుల కోసం జననీ జన్మ భుమిశ్చ స్వర్గాదపీ గరీయసీ స్వర్గాదపీ గరీయసీ

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Bobbili Puli

See All