Song Details
Lyrics
పల్లవి: చిలకమ్మ చెట్టెక్కి కూకుంది అమ్మానాయనో గోరింక గూట్లోకి దూరింది ఓరినాయనో చిలకమ్మ గుట్టేమి అవుతుందో గోరింక గొడవేమి చేస్తుందో వెన్నెలంటి కన్నె సోకు వెచ్చబడ్డ సందెకాడ కమ్ముకున్న హాయి చూసి కన్నుగీటెనమ్మో ఈడు చిలకమ్మ చెట్టెక్కి కూకుంది అమ్మానాయనో గోరింక గూట్లోకి దూరింది ఓరినాయనో చరణం: 1 చెయ్యేస్తే వణికే రెక్క దాని సోకంత పైసూరెక్క ఎక్కింది తలకే తిక్క మల్లె మంచాన కోరింది పక్క మారాకు చీరెట్టి పూరేకు రైకెట్టి మర్యాద చేస్తానులే కొంగిట్లో ముద్దెట్టి కౌగిట్లో కన్నెట్టి కవ్వించు కుంటానులే నీ చెయ్యే కలిసిన చెలిమికి పండుగ ముందే ఉందిలే చిలకమ్మ చెట్టెక్కి కూకుంది అమ్మానాయనో గోరింక గూట్లోకి దూరింది ఓరినాయనో చిలకమ్మ గుట్టేమి అవుతుందో గోరింక గొడవేమి చేస్తుందో వెన్నెలంటి కన్నె సోకు వెచ్చబడ్డ సందెకాడ కమ్ముకున్న హాయి చూసి కన్నుగీటెనమ్మో ఈడు చిలకమ్మ చెట్టెక్కి కూకుంది అమ్మానాయనో గోరింక గూట్లోకి దూరింది ఓరినాయనో చరణం: 2 ఎన్నెన్ని నేర్చావబ్బా నిన్ను కన్నోడు ఎవడోయబ్బా ఈడేరి పుట్టావమ్మా నిన్ను ఏ తల్లి కందోయమ్మా లేతాకు నాజూకు నీరల్ల తీసేసి తాంబూలమిస్తానులే నీ కుర్రబుగ్గల్లో నా ఎర్ర ముద్దిచ్చి రోజాలు కోస్తానులే నా తల్లో చండును తాకే ముచ్చట ముందే ఉందిలే చిలకమ్మ చెట్టెక్కి కూకుంది అమ్మానాయనో గోరింక గూట్లోకి దూరింది ఓరినాయనో చిలకమ్మ గుట్టేమి అవుతుందో గోరింక గొడవేమి చేస్తుందో వెన్నెలంటి కన్నె సోకు వెచ్చబడ్డ సందెకాడ కమ్ముకున్న హాయి చూసి కన్నుగీటెనమ్మో ఈడు చిలకమ్మ చెట్టెక్కి కూకుంది అమ్మానాయనో గోరింక గూట్లోకి దూరింది ఓరినాయనో
Lyrics sourced from public databases. May contain errors.