MovieGQ

Chupulatho Deepala

Bengal Tiger (2015) · Track 3 of 5

Song Details

Singer
Music Director
Lyricist

Lyrics

చూపులతో దీపాల దేహముతో ధూపాల చంపయ్యకే నన్ను చంపయ్యకే నవ్వులతో చెరసాల నడుముతో మధుశాల చంపయ్యకే నన్ను చంపయ్యకే ఓ కలముకు అందానికి అక్షరమా కవితకు తెలపని లక్షణమా బాపుకే దొరకని బొమ్మవే బ్రహ్మకే వన్నె తెచ్చిన వెన్నెలమ్మవే నీ చక్కని చిత్రానికి కాగితాన్ని ఇచ్చుకున్నా ప్రతి కొమ్మా ప్రతి రెమ్మా జన్మ ధన్యమే నీ చక్కని దేహానికి హత్తుకున్న చీర రైక నేసిన ఆ చేతులది గొప్ప పుణ్యమే నిధురకు మెళుకువ తెచ్చే అందం నీవే లేవే నిన్ను మరవడం అంటే మరణములే చూపులతో దీపాల దేహముతో ధూపాల చంపయ్యకే నన్ను చంపయ్యకే ఏ ఋతువో ఏ రుణమో వేల వేల ఏళ్ల వేచి ఈ తెలుగు నేలనిలా ఎంచుకుందిలే ఆ నదులు ఈ సుధలు కోరి కోరి తపసు చేసి నీ పాదాలకు నడకనిల పంచుకున్నావే ఏమిటి చంద్రుడు గొప్ప అది నీ వెలుగే తప్ప ఇలకే జాబిలివై జారావే

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Bengal Tiger

See All