Song Details
Lyrics
ఉత్తరాన నీలి మబ్బుల లేఖలో ఉత్తరాలు రాయజాలని ప్రేమలో కలత నిదర చెదిరే తొలి కలల వలపు ముదిరే కొత్త కొత్తందాలు మత్తెక్కెంచే జోరులో ఉత్తరాన నీలి మబ్బుల లేఖలో ఉత్తరాలు రాయజాలని ప్రేమలో ఈ కన్నె లేతందాలే ఏతలేసి తోడుకో నా సిగ్గు పూతల్లోన తేనె జున్ను అందుకో ఈ పొద్దు వద్దంటున్న మొమాటాల పక్కనే ఓ ముద్దు ముద్దంటాయి ఆరాటాలు ఎక్కడో చేరుకో పొదరిల్లకి చీకటి చిరు తిల్లకి అలకాపురి చిలకమ్మకి కుళుకెందుకో ఒక్కసారికి ఒళ్ళో వేడెక్కింది గిల్లికజ్జా ప్రేమకి ఉత్తరాన నీలి మబ్బుల లేఖలో ఉత్తరాలు రాయజాలని ప్రేమలో మంచమ్మ ముంగిళ్ళల్లో దీపాలెట్టి చూసుకో సందేల మంచాలేసి సంకురాత్రి చేసుకో మామల్లే మాగానుల్లో బాసలంత చేసుకో పూబంతి పూవందాలు బందీ కట్టి వెళ్లిపో పూటకో పులకింతగా జంటగా పురి విప్పుకో మరుమల్లెల మహారాజుకి తెరచాటుల ప్రతి రోజుకి ఆపేదెట్టాగంటా పువ్వైపోయే రెమ్మని ఉత్తరాన నీలి మబ్బుల లేఖలో ఉత్తరాలు రాయజాలని ప్రేమలో కలత నిదర చెదిరే తొలి కలల వలపు ముదిరే కొత్త కొత్తందాలు మత్తెక్కెంచే జోరులో ఉత్తరాన నీలి మబ్బుల లేఖలో ఉత్తరాలు రాయజాలని ప్రేమలో
Lyrics sourced from public databases. May contain errors.