Song Details
Lyrics
కన్ను కొట్టినా నన్ను కుట్టవా రేగే తేనీగ కంట చూసినా కందిపోతవే తూగే తూనీగ కన్ను కొట్టినా నన్ను కుట్టవా రేగే తేనీగ హే కంట చూసినా కందిపోతవే తూగే తూనీగ అయినా సరే అన్నాగా సిద్ధంగానే ఉన్నాగా అందం అంతా నిండా కందేందుకే అందిస్తున్నాగా దేవుడా అమ్మాయంటె ఇలా కూడా ఉంటుందా ఎక్కడా మచ్చుక్కూడా ఆడ లక్షణం లేకుండా ఎంతకీ తెగించావే పైగా ఎందుకు ఈ నింద అందుకే తప్పనిసరై ముందడుగేశా కాస్తంత కన్ను కొట్టినా నన్ను కుట్టవా రేగే తేనీగ కంట చూసినా కందిపోతవే తూగే తూనీగ చరణం: 1 పెదవిచ్చి వరం వద్దనుకుంటావా విదిలించీ వ్రతం ముద్దనుకున్నావా బెదిరించే గుణం ప్రేమని అంటావా శృతి మించే తనం క్షేమం అంటావా వెచ్చగా నెచ్చెలి వస్తే వెళ్లిపోమంటావా వెల్లువై ముంచుకువస్తే తాళదే పడవ నది లోతెంతుందో ఒడ్డున ఉండే చూస్తూ ఉంటావా దేవుడా అమ్మాయంటె ఇలా కూడా ఉంటుందా ఎక్కడా మచ్చుక్కూడా ఆడ లక్షణం లేకుండా ఎంతకీ తెగించావే పైగా ఎందుకు ఈ నింద అందుకే తప్పనిసరై ముందడుగేశా కాస్తంత చరణం: 2 వాస్తు లోపం ఉందా నా ఒంటి వంపుల్లో దృష్టిదోషం ఉందా నీ కంటి చూపుల్లో ఈడు తాపం ఇలా వీధెక్కు చిందుల్లో ఏమి లాభం పిల్లా ఇబ్బందితనంలో యవ్వనం నివ్వెరపోదా కోరికే లేదంటే చెప్పినా నమ్మవు కదా తీరికే లేదంటె అరె పాపం అని పాపాయిని పాలించలేవా దేవుడా అమ్మాయంటె ఇలా కూడా ఉంటుందా ఎక్కడా మచ్చుక్కూడా ఆడ లక్షణం లేకుండా ఎంతకీ తెగించావే పైగా ఎందుకు ఈ నింద అందుకే తప్పనిసరై ముందడుగేశా కాస్తంత కన్ను కొట్టినా నన్ను కుట్టవా రేగే తేనీగ కంట చూసినా కందిపోతవే తూగే తూనీగ అయినా సరే అన్నాగా సిద్ధంగానే ఉన్నాగా అందం అంతా నిండా కందేందుకే అందిస్తున్నాగా దేవుడా అమ్మాయంటె ఇలా కూడా ఉంటుందా ఎక్కడా మచ్చుక్కూడా ఆడ లక్షణం లేకుండా ఎంతకీ తెగించావే పైగా ఎందుకు ఈ నింద అందుకే తప్పనిసరై ముందడుగేశా కాస్తంత
Lyrics sourced from public databases. May contain errors.