Song Details
Lyrics
తననాన నానాన తననాన నానాన మోగింది జేగంట మంచే జరిగేనంటా మనసంటోంది ఈ మాట కొలిచే దైవాలంతా దీవించారనుకుంటా నను పిలిచినది పూబాట తనతో పాటే వెళ్లిపోతా... ఆకాశం నీడంతా నాదేనంటోంది అలలు ఎగసే ఆశ... ఏ చింతా కాసింత లేనే లేదంది కలత మరిచే శ్వాస... మోగింది జేగంట మంచే జరిగేనంటా మనసంటోంది ఈ మాట మనసంటోంది ఈ మాట పదపదమని నది నడకనీ ఇటు నడిపినదెవరైనా తన పరుగులో తెలి నురగలో నను నేనే చూస్తున్నా ప్రతి పిలుపునీ కథ మలుపనీ మలి అడుగులు వేస్తున్నా అలుపెరుగనీ పసి మనసునై సమయంతో వెళుతున్నా నలుసంత కూడా నలుపేది లేని వెలుగుంది నేడు నా చూపున ఏ దూరమో ఏ తీరమో ప్రశ్నించనీ పయనంలోన ఈ దారితో సహవాసమై కొనసాగనా ఏదేమైనా... మోగింది జేగంట మంచే జరిగేనంటా మనసంటోంది ఈ మాట మనసంటోంది ఈ మాట ఒక చలువన ఒక వెలువన జత కలిసినదో సాయం మనసెరిగిన మధుమాసమై నను చేర్చిందే గమ్యం కల నిలవని కనుపాపలో కళలొలికినదో ఉదయం అది మొదలున నను ముసిరిన ఏకాంతం మటుమాయం నా చుట్టూ అందంగా మారింది లోకం ఊహల్లోనైనా లేదీ నిజం చిరునవ్వుతో ఈ పరిచయం వరమైయిలా నను చేరేనా బదులడగని ఈ పరిమళం నా జన్మనే మురిపించేనా... మోగింది జేగంట మంచే జరిగేనంటా మనసంటోంది ఈ మాట ఓ మనసంటోంది ఈ మాట
Lyrics sourced from public databases. May contain errors.