MovieGQ

Pacha Bottesina

Baahubali: The Beginning (2015) · Track 1 of 8 · 4:33

Song Details

Lyrics

పచ్చబొట్టేసిన పిల్లగాడా నీతో పచ్చిప్రాయాలనే పంచుకుంటానురా జంట కట్టేసిన తుంటరోడ నీతో కొంటె తంటాలనే తెచ్చుకుంటా దొరా వేయి జన్మాల ఆరాటమై వేచి వున్నానే నీ ముందరా చేయి నీ చేతిలో చేరగా రెక్క విప్పిందె నా తొందరా పచ్చబొట్టేసిన పిల్లగాడా నీతో పచ్చిప్రాయాలనే పంచుకుంటానురా మాయగా నీ సోయగాలాలు వేసి నన్నిలా లాగింది నువ్వే ... హలా! కబురులతో... కాలాన్ని ... కరిగించే వ్రతమేనా? హత్తుకుపో నను ఊపిరి ఆగేలా బాహు బంధాల పొత్తిళ్ళలో విచ్చుకున్నావే ఓ మల్లికా కోడె కౌగిళ్ళ ఒత్తిళ్ళలో పురి విప్పింది నా కోరికా పచ్చబొట్టేసిన పిల్లగాడా నీతో పచ్చిప్రాయాలనే పంచుకుంటానురా కానలో నువు నేను ఒక మేను కాగా కోనలో ప్రతి కొమ్మ మురిసేనుగా మరుక్షణమే ఎదురైనా మరణము కూడా పరవశమే సాంతము నే నీ సొంతము అయ్యాకా చెమ్మ చేరేటి చెక్కిళ్ళలో చిందులేసింది సిరి వెన్నెలా ప్రేమ ఊరేటి నీ కళ్ళలో రేయి కరిగింది తెలి మంచులా పచ్చబొట్టేసిన పిల్లగాడా నీతో పచ్చిప్రాయాలనే పంచుకుంటానురా జంట కట్టేసిన తుంటరోడ నీతో కొంటె తంటాలనే తెచ్చుకుంటా దొరా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Baahubali: The Beginning

See All