Song Details
Lyrics
బంగారు బొమ్మరావే పందిట్లో పెళ్లి నేడే ఇక లేవులే రణాలు ఎటుచూడు తోరణాలు కక్షలు ఇంకా లేనేలేవమ్మా అక్షింతలును కలపండోయమ్మా కళ్ళల్లోన కన్నీరేంటమ్మా చెల్లెలుకిచ్చే కట్నం లేదమ్మా బంగారు బొమ్మరావే పందిట్లో పెళ్లి నేడే పెన్నా సాక్షి మన పెళ్లిపీట వేసింది చిన్నిప్రేమా ఈ సూర్యచంద్రులను బావమరుదులుగా చూసి మురిసె సీమా బాంబులు నేడు తాంబూలాలై సంకల్పాలే సుముహూర్తాలై మెల్లంగా కొంటె వరుడు ఉంగరాలు మార్చు వేళ గిల్లగా ఈ పిల్లకు అణువణువున ఆనందం గుడు గుడు గుంచం గుండెల్లో రాగం... డుం డుం బాజా సన్నాయి మేళం... హా హా... గుడు గుడు గుంచం గుండెల్లో రాగం... హే... డుం డుం బాజా సన్నాయి మేళం... బంగారు బొమ్మరావే పందిట్లో పెళ్లి నేడే ఎదురు పడితే తొడ చరిసి పగతో ఉరిమురిమి చూసెవాళ్ళు ఈ రోజు పెళ్లి మండపము ముందు బంధువులు అయ్యినారు పసుపు రాసిన మూరెడు తాడు ఒక్కటి చేసే పల్లెలు నేడూ మీ గుండెల్లోన ఉంది రాల్లనైన నీరు చేసే త్యాగము అనురాగము ఇక ప్రేమే అనుబంధం ప్రేమా ప్రేమా మీదే ఊరమ్మా... రాయలసీమ పుట్టిల్లేనమ్మా... అ ఆ... ప్రేమా ప్రేమా మీదే ఊరమ్మా... రాయలసీమ పుట్టిల్లేనమ్మా... బంగారు బొమ్మరావే పందిట్లో పెళ్లి నేడే ఇక లేవులే రణాలు ఎటుచూడు తోరణాలు లలలా లలలా లలలా లలలా లల లాలే లాలలా లల లాలే లాలలా
Lyrics sourced from public databases. May contain errors.