Song Details
Lyrics
పల్లవి: కలలే కన్నానురా ఆశతో ఉన్నానురా త్వరగా రావేమిరా కలలే కన్నానురా వెన్నెల్లో ఈ రేయి విరబూసి ఉందోయ్ నీలాల కనుదోయి నిన్నే వెతికేనోయి సొగసులన్నీ దోచుకో నన్ను నీలో దాచుకో కలలే కన్నానురా చరణం: 1 నా సిగ్గు దోచేవు నను చూసి నవ్వేవు మెరుపల్లె మెరిసేవు మురిపించి పోయేవు నా సిగ్గు దోచేవు నను చూసి నవ్వేవు మెరుపల్లె మెరిసేవు మురిపించి పోయేవు కనులముందే ఉండిపో మనసు నిండా నిండిపో కలలే కన్నానురా చరణం: 2 పులకించే నా మేను ఏమేమో కోరేను నే చేర రాలేను ఒంటరిగా మనలేను పులకించే నా మేను ఏమేమో కోరేను నే చేర రాలేను ఒంటరిగా మనలేను వలపు పొంగే వేళరా నీవు నాతో చేరరా కలలే కన్నానురా ఆశతో ఉన్నానురా త్వరగా రావేమిరా కలలే కన్నానురా
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Asadhyudu
See AllNinnu Chusi Navvinda
S. Janaki, Pithapuram Nageswara Rao, Madhavapeddi Satyam
Saira Na Raja Hushar
L.R. Eswari, Madhavapeddi Satyam
Vella Galigithe Vellu Vellu Vellu
Ghantasala
Chittemma Chinnamma
P.B. Srinivas
Ila Ila Untundhani
P. Susheela, P.B. Srinivas
Bharathadesam Paradhasya
B. Gopalam, B. Vasantha