MovieGQ

Kammukonna Chikatlona

Arundhathi (2009) · Track 3 of 7

Song Details

Singer
Music Director

Lyrics

కమ్ముకున్నా చీకట్లోనా కుమ్ముకొచ్చే వెలుతురమ్మా కచ్చకట్టీ కత్తిపడితే చిచ్చురేపే కాళివమ్మా నీ కన్ను ఉరిమి చూడగానే దూసిన కత్తి వణికిపోవునమ్మా కుంచె పట్టి బొమ్మగీస్తే అదే నీ గుండెకే అద్దమమ్మా అందరినీ ఆదరించే దయామయి అన్నపూర్ణ నీవమ్మా ఆలన పాలనలో నువ్వే ఈ నేలకు తల్లివమ్మా నువ్వు పలికేదే తిరుగులేని వేదం నువ్వు చేసేదే ఎదురులేని చట్టం ఓర్పులోన ధరణి మాతవమ్మా తీర్పులోన ధర్మమూర్తివమ్మా జేజెమ్మా మాయమ్మా జేజెమ్మా ఓయమ్మా జేజెమ్మా జేజెమ్మా మా జేజెమ్మా (2) నువ్వు రుద్రరూపమెత్తగానే కాలమే దద్దరిల్లి పోయేనమ్మా రుద్రశక్తులకు నీ ధాటితో గుండెలే బద్దలైపోయేనమ్మా బుసగొట్టే కామాంధుని కసితీరక తొక్కవమ్మా పుట్టుగడ్డ ఆదుకున్న ఆ అపర భద్రకాళి నీవమ్మా మాటనిలుపుకొంటివమ్మా జేజెమ్మా మళ్ళి జన్మ ఎత్తినావమ్మా ఎంత దీక్ష పూనినావమ్మా గుండెలో నిప్పులే నింపినావమ్మా త్యాగమంటే నీదమ్మా నరకమే కొంగులోన ముడిచావమ్మా నిన్నుచూసి మృత్యువుకే జేజెమ్మా కళ్లు చెమ్మగిల్లినాయమ్మా ఈ జారుతున్న రక్తధారలే నీ తెగువకు హారతులు పట్టేనవ్మూ... ఓ... ఓ... ఆ... ఆ... దిక్కులన్నీ శూన్యమాయే వెలుతురంతా చీకటాయే ఆశలన్నీ ఇంకిపోయే శ్వాస మాత్రం మిగిలిపోయే

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Arundhathi

See All