Song Details
Lyrics
స నిసరిసని...ఆ హా హా స నిసమగమరి...ఆఆఆ ఆఆఆఆ పదస నిసరి సని...ఆ హా హా స నిసమగమరి...ఆఆఆ ఆఆఆఆ పద ససని నిని రిస గగ గరి మమ మగ ప స ని ద ప మ గ రి స ని చరణం: 1 కీరవాణీ చిలకలా కొలికిరు పాడవేమే వలపులే తెలుపగా విరబూసిన ఆశలు విరి తేనెను చల్లగా అలరులు కురిసిన ఋతువుల తడిసిన మధురస వాణి కీరవాణీ చిలకలా కొలికిరు పాడవేమే వలపులే తెలుపగా గరిగ సమగ పని సరిగ రిగస నిగ ఈ పూలలో అందమై ఈ గాలిలో గంధమై నా తోటలో ఛైత్రమై ఈ బాటనే నడచిరా నీ గగనాలలో నే చిరుతారనై నీ అధరాలలో నే చిరునవ్వునై స్వరమే లయగా ముగిసే కలలిక కలువక స్వరముల గతియిక గమకము తెలియకనే కీరవాణీ చిలకలా కలకలా పాడలేదు వలపులే తెలుపగా ఇల రాలిన పువ్వులు ఎద జల్లిన తావుల అలికిడి ఎరుగని పిలుపుల అలిగిన మంజులవాణీ కీరవాణీ చిలకలా కలకలా పాడలేదు వలపులే తెలుపగా చరణం: 2 నీ కన్నుల నీలమై నీ నవ్వుల వెన్నెలై సంపెంగల గాలినై తారాడనా నీడనై నీ పవనాలలో నే తొలి ప్రాసనై నీ జవనాలలో జాజుల వాసనై ఎదలో ఎదలే కదిలే... పడుచుల మనసుల కుంజర సుఖముల పలుకులు తెలియకనే కీరవాణీ చిలకలా కలకలా పాడలేదు వలపులే తెలుపగా విరబూసిన ఆశలు... విరి తేనెను చల్లగా అలరులు కురిసిన ఋతువుల తడిసిన మధురస వాణి కీరవాణీ చిలకలా కొలికిరు పాడవేమే వలపులే తెలుపగా
Lyrics sourced from public databases. May contain errors.