MovieGQ

Malle Poolu

Anubandam (1984) · Track 4 of 5

Lyrics

మల్లెపూలు గొల్లుమన్నవి పక్కలోన వెన్నెలొచ్చి గుచ్చుకున్నది గుండెలోన వేడుంది ఒంటిలో..జోరుంది వయసులో బోలెడంత కోరికుంది తీర్చుకోనా మల్లెపూలు గొల్లుమన్నవి పక్కలోన చల్లగాలి గిల్లుతున్నది సంబరాన ఎర్రాని పెదవిలో బిర్రయిన వయసులో బోలెడంత కోరికుంది తీర్చుకోనా నీచిలిపి నవ్వులో ఆనవ్వు వెలుగులో నాసొగసు ఆరబోసి మెరిసిపోనా నీఒంటి నునుపులో నీపెదవి ఎరుపులో నావయసు పొంగు నేను కలుపుకోనా గంగలాగా ఉరికిరానా కడలిలాగా కలుపుకోనా నా ఒడిలో ఉయ్యాలలూగించనా నాఎదకు నినుచేర్చి జోకొట్టనా నీతోటి బ్రతుకంతా ఒకవింత గలిగింత అనిపించి మెప్పించి ఒప్పించుకోనా మల్లెపూలు గొల్లుమన్నవి పక్కలోన వెన్నెలొచ్చి గుచ్చుకున్నది గుండెలోన ఎర్రాని పెదవిలో బిర్రయిన వయసులో బోలెడంత కోరికుంది తీర్చుకోనా నీ ముద్దు ముద్దులు.. మురిపాల సద్దులు ముప్పొద్దు మునిగితేలి మురిసిపోనా నీ మెత్త మెత్తని.. సరికొత్త మత్తులో నే చిత్ర చిత్తరంగా హత్తుకోనా హోయ్...గుండెలోనా నిండిపోనా నిండిపొయీ ఉండిపోనా నీప్రేమ నూరేళ్ళు పండించనా నీఇల్లు వెయ్యేళ్ళు వెలిగించనా బంధాలు ముడివేసి అందాల గుడి చేసి అనురాగ అర్చనలే చేయించుకోనా మల్లెపూలు గొల్లుమన్నవి పక్కలోన చల్లగాలి గిల్లుతున్నది సంబరాన ఎర్రాని పెదవిలో..బిర్రయిన వయసులో బోలెడంత కోరికుంది తీర్చుకోనా మల్లెపూలు గొల్లుమన్నవి పక్కలోన వెన్నెలొచ్చి గుచ్చుకున్నది గుండెలోన వేడుంది ఒంటిలో జోరుంది వయసులో బోలెడంత కోరికుంది తీర్చుకోనా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Anubandam

See All