Song Details
Lyrics
వీరభద్రుడే సాక్షి రుద్రుడే సాక్షి పసుపు కుంకుమ సాక్షి పంతమే సాక్షి పచ్చి నెత్తురుతో ఓ పోతుగడ్డా కక్ష కడిగింది మా ఆడబిడ్డా కసితీరే వేళ సై సిందెయ్ శివమెత్తర సాంబయ్యా! కోరస్: సై సిందెయ్ శివమెత్తర సాంబయ్యా! తై తకతయ్ తొడకొట్టర తమ్మయ్యా! హే అశ్శరభా దరువెయ్ దశ్శరభా! మనమియ్యాలా… కోరస్: ఇయ్యాలే ఎయ్యాలా జాతర చెయ్యాలా రారే రారే సై సిందెయ్ శివమెత్తర సాంబయ్యా! కోరస్: తై తకతయ్ తొడకొట్టర తమ్మయ్యా! చరణం: 1 కారం తిన్న కండలివీ..! రగతం మరిగే కత్తులివీ మీసం దువ్వే దమ్ములివీ రోషం రగిలే రొమ్ములివీ ఎవరైనా రానీ, కో: ఓ ఓ ఓ ఏవైనా కానీ, కో: ఓ ఓ ఓ నీ సేవలోనే, కో: నీ సేవలోనే మేమున్నాం సామీ...!! కోరస్: మేమున్నాం సామీ మనసు కలిసెనంటే ఉసురైనా ధార పోస్తాం మనసు విరిగెనంటే మరి ఊరుకోం హే సై సిందెయ్ శివమెత్తర సాంబయ్యా! తై తకతయ్ తొడకొట్టర తమ్మయ్యా! చరణం: 2 అది అహోబిలం మనకున్న మహాబలం కాదా! పెరిగే తాపం నరికే నరసిమ్హుడా శివుణ్ణి మన శ్రీశైలం కట్టేసిందా లేదా కోరస్: మనమా దొరకి భటులం అయ్యాం కదా బ్రహ్మం గారి జ్ఞానం...!! కోరస్: వేమన వేదం అందించిన పుణ్యం... కోరస్: మనకే సొంతం నా నా నా ఆ నా నా ఈ రతనాల సీమ ...!! కోరస్: ఈ రతనాల సీమ ఆ రాయల చిరునామా.!! కో: ఆ రాయల చిరునామా కోరస్: ఏడుకొండల పైన కొలువైన యెంకటరమణ మనం పిలవగానే తనే దిగిరాడా హే సై సిందెయ్ శివమెత్తర సాంబయ్యా తై తకతయ్ తొడకొట్టర తమ్మయ్యా హే అశ్శరభా, కో: అశ్శరభా దరువెయ్ దశ్శరభా...!! కోరస్: దశ్శరభా మనమియ్యాలా... కోరస్: ఇయ్యాలే ఎయ్యాలా జాతర చెయ్యాలా రారే రారే సై సిందెయ్ శివమెత్తర సాంబయ్యా తై తకతయ్ తొడకొట్టర తమ్మయ్యా
Lyrics sourced from public databases. May contain errors.