Manava Manava
Song
Movie
-
Music Director
-
Lyricist
-
Singers
- Sunitha Upadrashta
Lyrics
- మానవా మానవా ఏమి కోరిక
చెప్పవా చెప్పవా జాగుచెయ్యకా
మానవా మానవా ఏమి కోరిక
చెప్పవా చెప్పవా జాగుచెయ్యకా
విన్నపాలనే ఆలకించిన అప్సర నేనేరా...
స్వర్గభోగమే నేల దించిన కిన్నెర నేనేరా...
ఇంద్రలోకమొచ్చి కళ్ళముందు వాలినా
ఎందుకంట ఇంత యోచనా
ఇంతదూరమొచ్చినాక ఇంకా
అందుకోవ సోకు సూచనా
అమ్మకచెల్లా ఏముందిరో
సొంపుల ఖిల్లా అదిరిందిరో
అమ్మకచెల్లా ఏముందిరో
సొంపుల ఖిల్లా అదిరిందిరో
పక్కకొచ్చెనే... తిక్కపెంచెనే
పక్కకొచ్చెనే తిక్కపెంచెనే వయ్యారి నీ వాలకం
దిగ్గజాలనే... ధిక్కరించెనే
దిగ్గజాలనే ధిక్కరించెనే నరుడా నీలో సాహసం
మైకంలో ముంచుతున్నది పాపా నీ పనితనం
మోహంలో ముంచుతున్నది నరుడా నీ మగతనం
కొంటె కోరిక రెచ్చగొట్టకా చుక్కా చాలింక
వేడి వేడిగా జోడుకూడగా వచ్చా నీవంక
చెయ్యేస్తే కందేలా ఉన్నావే బొమ్మా
సందేహిస్తే ఎల్లా ముందుకురావమ్మా
మానవా మానవా ఏమి కోరిక
చెప్పవా చెప్పవా జాగుచెయ్యకా
అమ్మకచెల్లా ఏముందిరో
సొంపుల ఖిల్లా అదిరిందిరో
తియ్య తియ్యగా... అందచేయనా
తియ్య తియ్యగా అందచేయనా
పెదవుల్లోని అమృతం
మత్తు మత్తుగా... ఊపుతున్నదే
మత్తు మత్తుగా ఊపుతున్నదే పిల్లో నన్నే నీనడుం
కౌగిల్లో వాలమన్నది ఊరించే ఉత్సవం
తందానా తాళమైనది చిందాడే యవ్వనం
సుందరాంగితో సంబరాలలో రాజ్యం నీదెదొరా
ముద్దరాలితో ముద్దులాటలో మొక్షం పొందేలా
ఆనందం ఈపైనా నీదే అంటున్నా
ఏదేమైనా మైనా నీతోనే రానా
Anji
Movie More SongsManava Manava Keyword Tags
-
-