Song Details
Lyrics
పల్లవి: అడగనా మాననా అమ్మాయి అడిగితే ఇస్తావా హాయి అడగనా మాననా అమ్మాయి అడిగితే ఇస్తావా హాయి అడిగినా మానినా అబ్బాయి ఎన్నడో కలిపాను చేయి అడిగినా మానినా అబ్బాయి ఎన్నడో కలిపాను చేయి చరణం: 1 మగవాడు చేసేది ఏమిటి వగలాడి మురిసేది ఏమిటి మగవాడు చేసేది ఏమిటి వగలాడి మురిసేది ఏమిటి మగవాడు చేసేది అల్లరి మగవాడు చేసేది అల్లరి వగలాడి మురిసేది రాగ వల్లరి అడగనా మాననా అమ్మాయి అడిగితే ఇస్తాను హాయి చరణం: 2 మగవాడు తలచేది ఏమిటీ జవరాలు మరువనిది ఏమిటీ మగవాడు తలచేది ఏమిటీ జవరాలు మరువనిది ఏమిటీ మగవాడు తలచేది కమ్మని కైపు మగవాడు తలచేది కమ్మని కైపు ప్రియురాలు మరువనిది ప్రియతమ రూపు అడగనా మాననా అమ్మాయి అడిగితే ఇస్తాను హాయి చరణం: 3 మగవాడు కోరేది ఏమిటీ ప్రియురాలు ఇచ్చేది ఏమిటీ మగవాడు కోరేది ఏమిటీ ప్రియురాలు ఇచ్చేది ఏమిటీ మగవాడు కోరేది ఆనందం మగవాడు కోరేది ఆనందం ప్రియురాలు ఇచ్చేది మెచ్చేది అనుబంధం అడగనా మాననా అమ్మాయి అడిగితే ఇస్తావా హాయి అడిగినా మానినా అబ్బాయి ఎన్నడో కలిపాను చేయి
Lyrics sourced from public databases. May contain errors.