Song Details
Lyrics
పల్లవి యే...రాజయోగం వచ్చిందయ్యో నీకూ... యే... మంచిరోజులొచ్చాయిలే నేడూ... కోరస్: రాజాధి రాజా వీరాధి వీర నీకు వందనాలు కోటి సూర్యులు వేలతారలు నీకు సాటికారు నువ్వు అండగా మాకు ఉండగా రోజు పండగేలే నిన్ను చూసిన మాకు పుణ్యమే అందాల రాముడ రార రార కోరస్: రాజాధి రాజా వీరాధి వీర నీకు వందనాలు కోటి సూర్యులు వేలతారలు నీకు సాటికారు చరణం: 1 పువ్వుల చొక్కా తొడిగా వంటే ఎవరీ మన్మధుడని అంటారయ్య నిన్ను కళ్ళజోడు పెట్టావంటే సినిమా హిరోలాగే ఉంటావయ్య నువ్వు గురువానీది ఆ సింహరాసి కాదా మొనగాళ్ళైన నీ కాళ్ళు మొక్కలేదా కోరస్: ఎందరెందరో మెచ్చినవాడు మా ఊరికే వచ్చాడు ఊరంతా అదిరేలా విందులు చేయాలి ఆకాశం అదిరేలా చిందులు తొక్కాలి ఊరంతా అదిరేలా విందులు చేయాలి ఆకాశం అదిరేలా చిందులు తొక్కాలి కోరస్: రాజాధి రాజా వీరాధి వీర నీకు వందనాలు కోటి సూర్యులు వేలతారలు నీకు సాటికారు చరణం: 2 అన్న అదేంటన్నా అట్ట పడిపోయావ్ ఇందాకడ్నించి మీరేంచేత్తన్నార్రా మిమ్మల్ని పొగుడుతూ పాడతాన్నామండి అద్ది అందికే దిష్టి తలిగి కిందడి పోయాను ఒరేయ్ దిష్టి మొత్తం పోవాలి ఇప్పుడు తిడతాపాడండ్రా కుదరదండి ఏ మిమ్మల్ని పొగుడుతూ పాడ్డానికే డబ్బులిచ్చారండి ఓ...ఈ వెయ్యా తీసుకొని తిట్టేయండ్రా అయితే ఒకే తిట్టండ్రా చరణం: 3 కోరస్: సచ్చినోడా నీ యమ్మ కడుపు మాడ నువు పక్కనుంటె ఊరకుక్క చచ్చినంత కంపు ఓరి నాయనో ఓరి దిక్కుమాలినోడా నీ దిమ్మదిరిగి దొంగకోళ్ళ చూపు చూడమాకు హే పోరా పోరంబోక ఈ ఊళ్ళో ఉండమాక (2) అరె సిగ్గు ఎగ్గు ఉంటే నీకు మళ్ళీ ఇట్టారానే రాకు పెంట నాయాల రేగోతికాడ నక్క నీ గుడ్డలూడదీసి నిన్ను చెప్పుతోటి కొట్ట పెంట నాయాల రేగోతికాడ నక్క నీ గుడ్డలూడదీసి నిన్ను చెప్పుతోటి కొట్ట ఆ పండిరా రేయ్ మీకు దన్నమెడతానురా బాబు మీరు తిడతుంటే నామీద నాకే అసహ్యం ఏసేతుందిరా ఫస్ట్‌దే కంటిన్యూ అయిపోండమ్మా అలాగలాగే పాడిండిరా
Lyrics sourced from public databases. May contain errors.