MovieGQ

Neeli Meghama

Ammayila Sapatham (1975) · Track 1 of 4

Song Details

Lyrics

నీలి మేఘమా జాలి చూపుమా ఒక నిముష మాగుమా నా రాజుతో ఈ రాతిరి నన్ను కలిపి వెళ్ళుమా కన్నె అందమా కలత మానుమా ఒక్క నిముషమాగుమా నీ దైవము నీ కోసము ఎదుట నిలిచె చూడుమా అనుకోని రాగాలు వినిపించేనే కనరాని స్వర్గాలు దిగివచ్చేనే అనుకోని రాగాలు వినిపించేనే కనరాని స్వర్గాలు దిగివచ్చేనే కలలు పండి నిజముగా కనుల యెదుట నిలిచెగా రా.. జాబిల్లీ నా నెచ్చెలీ.. జాగేల.. ఈవేళ.. నను చేరగా నీలి మేఘమా జాలి చూపుమా.. ఒక నిముషమాగుమా నా రాజుతో ఈ రాతిరి నన్ను కలిపి వెళ్ళుమా..ఆ..ఆ కళ్యాణ మేళాలు మ్రోగించనా కంఠాన సూత్రాన్ని ముడివేయనా కళ్యాణ మేళాలు మ్రోగించనా.. కంఠాన సూత్రాన్ని ముడివేయనా.. గుండె గుడిగా చేయనా.. నిన్ను కొలువు తీర్చనా నీ దాసినై... సావాసినై... నా ప్రేమ పుష్పాల పూజించనా... కన్నె అందమా కలత మానుమా.. ఒక్క నిముషమాగుమా నీ దైవము నీ కోసము ఎదుట నిలిచె చూడుమా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Ammayila Sapatham

See All