Song Details
Lyrics
పల్లవి: అయ్యయ్యో బ్రహ్మయ్యా అన్యాయం చేశావేమయ్యా ఈ బుల్లోడే బుల్లెమ్మయితే ఎంత గుమ్ముగా ఉండేదయ్యా చరణం: 1 చిక్కని మీగడ తరకల్లాగా చక్కనైన చెక్కిళ్లు పసినిమ్మ పండులాగా మిసమిసలాడే ఒళ్లు బెట్టుచూసి గుట్టుదాచే గడసరి సొగసరికళ్లు కొంత కొడెతనముంది మరికొంత ఆడతనముంది అయ్యయ్యో బ్రహ్మయ్యా అన్యాయం చేశావేమయ్యా ఈ బుల్లోడే బుల్లెమ్మయితే ఎంత గుమ్ముగా ఉండేదయ్యా చరణం: 2 మూతిచూస్తే మీసమింకా మొలిచినట్టులేదూ బెదరుచూస్తే ఎవ్వరితోను కుదిరినట్టులేదూ -ఆ కసురులోనె అలకనవ్వులు విసురు లేకపోలేదు కొంత చిలిపితనముంది మరికొంత కలికితనముంది అయ్యయ్యో బ్రహ్మయ్యా అన్యాయం చేశావేమయ్యా ఈ బుల్లోడే బుల్లెమ్మయితే ఎంత గుమ్ముగా ఉండేదయ్యా చరణం: 3 బులిపించే సొగసున్న ఓ బుల్లోడా నిను చూస్తుంటే కొమ్ములు తిరిగిన మగాడికే దిమ్మెక్కిపోతుంటే కన్నెపిల్లలే చూశారా కన్నుగీటక మానేరా? కవ్వించే కౌగిలిలో కరిగించక వొదిలేరా? అయ్యయ్యో బ్రహ్మయ్యా అన్యాయం చేశావేమయ్యా ఈ బుల్లోడే బుల్లెమ్మయితే ఎంత గుమ్ముగా ఉండేదయ్యా
Lyrics sourced from public databases. May contain errors.