Nee Perento Telusu
Song
Movie
Music Director
Lyricist
Singers
Lyrics
- పల్లవి:
నీ పేరేంటో తెలుసు నీకు నా పేరేంటో తెలుసు
నీ పేరేంటో తెలుసు నీకు నా పేరేంటో తెలుసు
మన మధ్యలో ప్రేమన్నది
ఈ మధ్యలో తెలిసిందది
మనసిచ్చేస్తున్నది తెలుసు
ప్రేమించేస్తున్నది తెలుసు
ప్రేమించిన పిమ్మట ఏమౌతుందో ఇంకా తెలియదు
మనసిచ్చేస్తున్నది తెలుసు
ప్రేమించేస్తున్నది తెలుసు
ప్రేమించిన పిమ్మట ఏమౌతుందో ఇంకా తెలియదు
నీ పేరేంటో తెలుసు నీకు నా పేరేంటో తెలుసు
మన మధ్యలో ప్రేమన్నది
చరణం: 1
నిను చూస్తేనే నవ్వాలియని నా పెదవికి తెలిసింది
నువు వస్తే ఎగరాలి అని పైటకి తెలిసింది
నీ మాటే పలకాలి అని గొంతుకి తెలిసింది
లేకుంటే ఆగాలి అని గుండెకి తెలిసింది ఓహోహో
జరగంది జరుగుతున్నది జరిగేది తెలియకున్నది
తెలిసింది గొప్పగున్నది అంతే..
కొంతేగా తెలుసుకున్నది ఇంకెంతో మిగిలి ఉన్నది
ఎంతైనా ప్రేమ అన్నది ఇంతే...
నీ మనసేంటో తెలుసు
నీకు నా మనసేంటో తెలుసు
మనసైనది మనదైనది
చరణం: 2
ఇటువైపే చూడొద్దు అని లోకానికి తెలిసింది
ఈ జతని చేరొద్దు అని దూరానికి తెలిసింది
ఈ క్షణమే కరగొద్దు అని కాలానికి తెలిసింది
తలవంచే తీరాలి అని తలరాతకు తెలిసింది ఓహోహో..
భావంగా ఉండబోనని రూపాన్నే పొందుతానని
మనలాగ మారుతున్నది ప్రేమ
ప్రేమల్లో ఎన్ని మహిమలో
ప్రేమిస్తే ఎన్ని మలుపులో
మనసుంటే తెలుసుకుంటది ప్రేమ
నీ పేరేంటో తెలుసు నీకు నా పేరేంటో తెలుసు
నీ పేరేంటో తెలుసు నీకు నా పేరేంటో తెలుసు
మన మధ్యలో ప్రేమన్నది
ఈ మధ్యలో తెలిసిందది
మనసిచ్చేస్తున్నది తెలుసు
ప్రేమించేస్తున్నది తెలుసు
ప్రేమించిన పిమ్మట ఏమౌతుందో ఇంకా తెలియదు
మనసిచ్చేస్తున్నది తెలుసు
ప్రేమించేస్తున్నది తెలుసు
ప్రేమించిన పిమ్మట ఏమౌతుందో ఇంకా తెలియదు
నీ మనసేంటో తెలుసు
నీకు నా మనసేంటో తెలుసు
మనసైనది మనదైనది